Asianet News TeluguAsianet News Telugu

‘ఫోర్డ్’ పొదుపు చర్యలు: సిబ్బంది కోత.. యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేత

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ పొదుపు చర్యలు ప్రారంభించింది. వివిధ దేశాల్లో 7,000 మంది ఉద్యోగులను తొలిగించాలని, ఉత్పాదక యూనిట్లు కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించింది. సుమారు 500 మిలియన్ల డాలర్ల నిధులతో విద్యుత్ వాహనాలు, ఆటానమస్ డ్రైవింగ్ వాహనాల తయారీకి ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

Ford to cut 7,000 jobs, 10% of global salaried staff
Author
New York, First Published May 21, 2019, 2:53 PM IST

న్యూయార్క్: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్’పొదుపుచర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం సిబ్బంది అంటే ఏడు వేల మందిని తొలగించాలని నిర్ణయించుకున్నది. కంపెనీ వెహికల్స్ ఆఫరింగ్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని తలపెట్టినట్లు తెలిపింది. 

తన సిబ్బంది తొలగింపు ప్రక్రియలో తొలుత ఆగస్టు నాటికి వైట్ కాలర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌లో కొందరిని తొలిగించి వేయడం గానీ, మరి కొందరిని రీఅసైన్మెంట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫోర్డ్ అధికార ప్రతినిధి మారిషా బ్రాడ్లే తెలిపారు. 

ఫోర్డ్ సెడాన్ కార్లకు అమెరికాలో చాలా మంది కస్టమర్లు ఉన్నారు. వారిలో కొందరు పికప్ ట్రక్స్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) వాహనాలను ఆప్ట్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే గతేడాది నార్త్ అమెరికా రీజియన్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో మొత్తం 800 మందిని ఫోర్డ్ తొలిగించి వేసింది. 

ఉద్యోగుల తొలగింపు ద్వారా ఫోర్డ్ సంస్థ 600 మిలియన్ల డాలర్ల నిధులు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇలా పొదుపు చేసిన ఆదాయాన్ని ఫోర్డ్ సంస్థ విద్యుత్ వాహనాలను తయారు చేయడంపైనా ఖర్చు చేయాలని నిర్ణయించింది. 

అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అభివ్రుద్ధి చేయడంపైనా, భవిష్యత్ సంస్థ పురోగతికి వినియోగించాలని ఫోర్డ్ నిర్ణయించింది. ఎఫ్-150 పికప్ ట్రక్స్ ఉత్తర అమెరికాలో విక్రయించిన ఫోర్డ్.. ఇతర సంస్థలతోనూ విజయవంతంగా పోటీ పడుతోంది. 

ఫోర్డ్ సీఈఓ జిమ్ హాకెట్ ‘భవిష్యత్ దిశగా విజయవంతంగా ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో బ్యూరోక్రసీ తగ్గించివేయడం, ఎంపవర్ మేనేజర్లు, స్పీడ్ డిసిజన్ మేకింగ్, వ్యయం తగ్గింపుపై కేంద్రీకరించాల్సి ఉన్నది’ అని ఒక ఈ-మెయిల్‌లో తెలిపారు. 2018 నాటికి 2.02 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ క్రమంలో జర్మనీలో 5000 మందిని ఉద్యోగాలను తొలగించడం అది 1.99 లక్షల మంది ఉద్యోగులకు తగ్గిపోయింది. 

ఉద్యోగులను తొలగించి వేయడంతోపాటు బ్రెజిల్‌లో కమర్షియల్ హెవీ ట్రక్ బిజినెస్ నుంచి వైదొలగాలని ఫోర్డ్ నిర్ణయించింది. రష్యాలో సంస్థ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలని.. అలాగే రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని ఫోర్డ్ నిర్ణయించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios