Asianet News TeluguAsianet News Telugu

‘ఫోర్డ్’ పొదుపు మంత్రం: వోక్స్ వ్యాగన్.. మహీంద్రాలతో టైఅప్?

ఇటు పొదుపు.. అటు విస్తరణ వెరసి లాభాల పెంపు ఇదీ ఫోర్డ్ వ్యూహం. ఒకవైపు జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ తోనూ, మరోవైపు భారతదేశ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’తోనూ సంప్రదింపులు జరుపుతోంది ఫోర్డ్. అయితే ఈ భాగస్వామ్యం సాకారం కావాలంటే మరో ఏడాది దాటాల్సిందే సుమా.

Ford Expands Partnership Talks With Volkswagen, Mahindra To Cut Costs
Author
Mumbai, First Published Sep 27, 2018, 8:40 AM IST

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఫోర్డ్’ పొదుపు మంత్రం జపిస్తోంది. అత్యధిక లాభాలు గడిస్తున్న సంస్థగా పేరొందిన ‘ఫోర్డ్’.. సహచర కార్ల తయారీ సంస్థలు వోక్స్‌వ్యాగన్, భారతదేశ కార్పొరేట్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థలతో భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేపట్టింది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు మూడు ఆటోమొబైల్ సంస్థలు కూటమిగా మారిపోవడంతోపాటు వ్యయం తగ్గడం.. ఆయా సంస్థల బిజినెస్ విస్తరించడానికి వీలవుతుంది. 

ఫోర్డ్ మోటార్స్ కో- సీఈఓ జిమ్ హాకెట్ మాట్లాడుతూ పొదుపు లక్ష్యంగా తమ బిజినెస్ పునర్వ్యవస్థీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు 300 అంతర్జాతీయ ఆటోమేకర్స్ సీఈఓలో సమావేశంలో ప్రకటించారు.

పొదుపు పాటించే దిశగా కార్యాచరణలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని హాకెట్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇతర ఆటోమొబైల్ సంస్థలతోనూ లోతుగా భాగస్వామ్యం పెంపొందించుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఫ్యాక్టరీ ఫ్లోర్ కెపాసిటీకి తోడు ఉమ్మడిగా వాహనాలను అభివ్రుద్ది చేయడం వరకు బాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. 

ఈ విషయమై జర్మనీ ఆటో మేకర్ వోక్స్ వ్యాగన్ ఏజీ, భారతదేశానికి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది ఫోర్డ్. తమ ఉత్పత్తులతోపాటు టెక్నాలజీ భాగస్వామ్యాన్ని విస్తరించాలన్నది ఫోర్డ్ వ్యూహం. ప్రత్యేకించి దక్షిణ అమెరికా, యూరప్ దేశాల పరిధిలో వోక్స్ వ్యాగన్ సంస్థతో పరస్పర సహకారాన్ని వాణిజ్య వాహనాల విక్రయాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఫోర్డ్. 

వోక్స్ వ్యాగన్ లాటిన్ అమెరికా సీఈఓ పబ్లో డీ సీ మాట్లాడుతూ బ్రెజిల్ లో ఇతర ఆటోమొబైల్ సంస్థలతో ప్రత్యేకించి ఫోర్డ్ సంస్థతో భాగస్వామ్యం కోసం చర్చిస్తున్నామని, చర్చలు సానుకూలంగా ఉన్నాయన్నారు. అయితే 2019 వరకు భాగస్వామ్యంపై ప్రకటన అమలులోకి రాకపోవచ్చు. కానీ వోక్స్ వ్యాగన్ అధికార ప్రతినిధి భాగస్వామ్య చర్చలపై తదుపరి వివరాలపై స్పందించడానికి నిరాకరించారు.

ఆటోమొబైల్ సంస్థల భాగస్వామ్యం వల్ల వోక్స్ వ్యాగన్ యాజమాన్యం ఫోర్డ్ సంస్థకు చెందిన అత్యంత లాభదాయక వాహనాలను పొందాలని భావిస్తున్నది. ప్రత్యేకించి వాణిజ్య వాహనాలు, రేంజర్ కంపాక్ట్ ట్రక్కులతో లాభం పొందాలని భావిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థతోనూ వేరుగా ఫోర్డ్ సంస్థ చర్చలు జరుపుతోంది. అయితే 2020 నాటికి ఉమ్మడిగా వాహనాల అభివ్రుద్ధికి వేదిక సిద్ధమవుతుంది. దీనిపై మహీంద్రా అండ్ మహీంద్రా అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. 

వచ్చే మూడేళ్ల నుంచి ఐదేళ్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ రెండు సంస్థలు కలిసి 11 బిలియన్ల డాలర్లతో బిజినెస్‌ను పునర్య్వవస్థీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఫోర్డ్ తన లాభాలను పెంచుకోవాలని తలపెట్టింది.

విద్యుత్, సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అభివ్రుద్ధి చేయాలని అందుకోసం బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడిగా పెట్టి వచ్చే రెండేళ్లలో అత్యుత్తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి తేవాలని సంకల్పించింది. ఫోర్డ్ సీఈఓ హాకెట్ మాత్రం భాగస్వామ్య ఒప్పంద వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. 2020 నాటికి ఫోర్డ్ తన లాభాలను ఎనిమిది శాతం పెంచుకోవాలని తలపెట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios