Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఏడాది ఫియట్ జీప్.. కంపాస్ సహా పలు సంస్థల ఎస్‌యూవీలతో ‘సై’


మహీంద్రా అల్టూరస్, టయోటా ఫార్చూనర్, కంపాస్ వంటి ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఫియట్ క్యిస్టర్ సిద్ధమైంది. 

Fiat Chrysler Automobile to launch new Jeep SUV in India
Author
Mumbai, First Published Jul 4, 2019, 10:59 AM IST

ముంబై: ఇటాలియన్ - అమెరికన్ ఆటో మేజర్ ఫియట్ క్రిస్లర్ విపణిలోకి సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారును విడుదల చేయనున్నది. ప్రత్యేకించి భారత మార్కెట్లోకి జీప్ బ్రాండ్ వాహనాల్లో అత్యున్నత ఎస్‌యూవీ కారును విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. 

ఫియట్ క్రిస్లర్ విడుదల చేసే నూతన జీప్ అనే కారు ప్రత్యర్థి సంస్థ ‘కంపాస్’ ఎస్‪యూవీ జీప్, టయోటా ఫార్చూనర్, ఫోర్డ్ ఏండీవర్, మహీంద్రా ఆల్టూరస్, హోండా సీఆర్వీ ఎస్‌యూవీ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనున్నది. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫియట్ విడుదల చేయనున్న ఈ జీప్ మోడల్  ఏడు సీటర్ల ఎస్‌యూవీగా ఉంటుంది. ఫియట్ నూతన తరం కారును మహారాష్ట్రలోని పుణె నగర శివారుల్లో రంజన్‌గావ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయాలని సంకల్పించింది. ఫియట్ సన్నిహిత వర్గాల ప్రకారం ఈ కారును వచ్చే ఏడాది ద్వితీయార్థంలో గానీ, 2021 తొలి ప్రథమార్థంలో గానీ విపణిలోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. 

ట్రైల్ హాక్, కంపాస్, గ్రాండ్ కంపాస్ జీపులతోపాటు 2020లో ఆఫ్ స్ప్రింగ్ ‘ఆల్ న్యూ కంపాస్’ విడుదలకు ఫియట్ సిద్ధమైంది. కంపాస్ ‘జీపు’మోడల్ కారుతో పోటీ పడి మున్ముందు మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందాలన్న లక్ష్యంతో ఫియట్ ముందుకు సాగుతున్నది. 

అధికారికంగా ఫియట్ క్రిస్లర్ ఇండియా తన ప్రణాళికలపై స్పందించకున్నా 2017 మధ్యలో విడుదల చేసిన కంపాస్ ఎస్‌యూవీ ఆవిష్కరణతో శుభారంభాన్ని అందించిందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ బ్రాండ్ ఎస్ యూవీ మోడల్ వాహనాలు తర్వాత కాసింత మందగించినా తిరిగి 2018-19లో పోటీ తీవ్రతరమైందని ఎఫ్‌సీఏ ఇండియా అంచనాకు వచ్చింది. 2017-18తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌సీఏ ఇండియా ఆటో సేల్స్ 17 శాతం (19,358 నుంచి 16 వేల యూనిట్లకు) పడిపోయాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమొబైల్ వాహనాల విక్రయాలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని అంచనా వేస్తున్నాయి. ట్రైల్ హాక్ వంటి లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లతో పూర్వ వైభవం సంపాదించుకుంటామని ఎఫ్‌సీఏ ఇండియా అంచనా వేస్తోంది. బీ- సెగ్మెంట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘రెనెగడ్’ను ఆవిష్కరించాలని ముందుగా ఎఫ్‌సీఏ ఇండియా భావించినా తర్వాత అసలు ఆ ఆలోచనే విరమించుకున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios