Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్‌లోకి బెంజ్ ‘కాబ్రియోలెట్‌’.. జస్ట్ రూ. 65.25 లక్షలే

జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్-బెంజ్ తాజాగా విడుదల చేసిన సీ- క్లాస్ కాబ్రియోలెట్ ఫేస్ లిఫ్ట్ భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.65.25 లక్షలుగా నిర్ణయించారు.

Exclusive: 2018 Mercedes-Benz C-Class Cabriolet Facelift Launched In India; Priced At  65.25 Lakh
Author
Mumbai, First Published Oct 29, 2018, 12:46 PM IST

ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ సరికొత్త సీ-క్లాస్‌ కాబ్రియోలెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతకు ముందు మోడల్‌తో పోలిస్త కొత్త మోడల్‌లో మరిన్ని ఫీచర్లను జత చేసినట్టు కంపెనీ తెలిపింది. దీని ధర రూ.65.25 లక్షలుగా నిర్ణయించింది. అంతేకాదు సుదీర్ఘకాలం సాగే ఆటో షో నుంచి లైవ్ ప్రసారం చేసిన మెర్సిడెస్ బెంజ్ మోడల్ కారు కాబ్రియోలెట్‌ మొదటిది. ఇది భారతదేశ మార్కెట్ లో విడుదల చేసిన 11వ మోడల్ కారు.

బీఎస్‌ 6 పెట్రోల్‌ ఇంజన్‌, మల్టీ బీమ్‌ హెడ్‌లాంప్స్‌, ఆకర్షణీయమైన అలాయ్‌వీల్‌ డిజైన్‌, కొత్తతరం స్టీరింగ్‌ వీల్‌, స్మార్ట్‌ఫోన్‌ ఇంటిగ్రేషన్‌ ప్యాకేజ్‌ తదితర వసతులు ఈ కారులో ఉన్నట్టు కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌ జాప్‌ తెలిపారు. గత మూడేళ్లుగా భారత మార్కెట్లో అగ్రస్థానంలో తమ కంపెనీ కొనసాగుతోందని చెప్పారు. 2017లో కంపెనీ 15,330 కార్లు విక్రయించింది. అంతకు ముందు 2016లో 13,231 కార్లను అమ్మింది. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 11,789 కార్లు అమ్ముడయ్యాయి.

ప్రస్తుత జెన్ సీ- క్లాస్ సీ-కాబ్రియోలెట్ మోడల్ కారును తొలుత 2014లో, తర్వాత 2016లో కొన్ని మార్పులతో మార్కెట్లో ఆవిష్కరించారు. తాజాగా ఆవిష్కరించిన కాబ్రియోలెట్ మోడల్ కారులో 6,500కి పైగా విడి భాగాలను సమూలంగా మార్చేసింది మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం. రీ స్టైల్డ్ బంపర్లతోపాటు న్యూ మల్టీ బీం ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, నూతనంగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ చేర్చింది. సీ - క్లాస్ కాబ్రియోలెట్ కారు నూతన, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థను కలిగి ఉన్నది. 

అప్ డేటెడ్ కమాండ్ వ్యవస్థతో కూడి 10.25 అంగుళాల హెచ్డీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసింది మెర్సిడెస్ బెంజ్. ఇందులో నూతన ఎన్టీజీ 5.5 టెలిమాటిక్స్ కూడా చేర్చడం జరిగింది. కారు డ్రైవింగ్ ప్రారంభించిన 11 సెకన్లలో 40కి.మీ వేగాన్ని అందుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ సీ- క్లాస్ కాబ్రియోలెట్ మోడల్ కారు మూడు ఎక్స్ టీరియర్ కలర్స్ మొజావె సిల్వర్, సెలెనైట్ గ్రే, డిజైనో సెలెంటో గ్రే మాగ్నోల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నది. 

తాజాగా మార్కెట్లోకి విడుదలైన సీ- క్లాస్ కాబ్రియోలెట్ మోడల్ కారులో రెండు లీటర్ల పెట్రోల్ నింపుకోవడంతోపాటు 5,800-6100 ఆర్పీఎం, 258 బీహెచ్పీ పవర్‌తో కూడిన ఇంజిన్ ఏర్పాటు చేశారు. 1800- 4000 ఆర్పీఎం, 370ఎన్ఎం పీక్ టార్చ్ అదనపు ఆకర్షణ. మెర్సిడెస్ 9-స్పీడ్ 9జీ ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇందులో చేర్చారు. కేవలం 6.2 సెకన్లలో 100 కి.మీ వేగం పుంజుకుంటుంది. అత్యధికంగా న్యూ సీ - క్లాస్ కాబ్రియోలెట్ గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఈ కారు సొంతం. మెర్సిడెస్ బెంజ్ సీ - క్లాస్ కాబ్రియోలెట్ కారు తన ప్రత్యర్థి ఆడి ఏ5 కాబ్రియోలెట్ కారును ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios