విద్యుత్ కారుపై పూర్తిగా రోడ్డు టాక్స్ మాఫీ.. మారుతి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలా

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 7, Sep 2018, 10:35 AM IST
Electric car may save you over Rs 70,000 in road tax
Highlights

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రత్యేకించి కాలుష్య కారక నగరంగా పేరొందిన ఢిల్లీలో మరీ ప్రాధాన్యం సంతరించుకున్నది. కొత్త కారు కొన్నా.. పాతది రీ ప్లేస్ చేసినా విద్యుత్ వినియోగ కారు కొన్న వారికి దాదాపు రహదారి  టాక్స్ రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. 

న్యూఢిల్లీ: మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే త్వర పడండి విద్యుత్ వినియోగ కారు కొన్నా, పాత కారు స్థానే కొత్తది మార్చుకున్నా అదీ విద్యుత్ వినియోగ కారునే కొనండి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో రహదారి పన్ను మినహాయింపునిస్తోంది. అది రమారమీ రూ.70 వేల వరకు ఉండొచ్చని అంచనా. విద్యుత్ వాహనాల విధానంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్న కేంద్రం.. త్వరలోనే ఈ పాలసీ విధి విధానాలు ప్రజల ముందుకు వస్తాయని చెబుతోంది. ఇక కాలుష్య కారక నగరంగా పేరొందిన ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ వాహనాల కొనుగోలు చేసే వారికి రాయితీలు ప్రకటిస్తోంది. ఈ సంగతిని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ చార్జింగ్ వసతులు కల్పించడంపైనా ద్రుష్టిని సారించామన్నారు. 

రూ.6 లక్షలు దాటితే ఏడు శాతం టాక్స్
ఉదాహరణకు విద్యుత్ వాహనం ధర రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలు పలుకుతుంటే మీరు రూ.70 వేల వరకు రోడ్డు టాక్స్ పొదుపు చేయొచ్చు. వాహనం ధర రూ.6 లక్షలు దాటిన వాటిపై ఏడు శాతం రహదారి పన్ను విధిస్తున్నారు. గతనెల 27వ తేదీన విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కల్పించాల్సిన మౌలిక వసతులపై కైలాష్ గెహ్లాట్ అధ్యక్షతన సమీక్షించారు. పెట్రోల్, సీఎన్జీ పంపుల మాదిరిగానే విద్యుత్ చార్జింగ్ పంపులను కూడా ఢిల్లీ నగర పరిసరాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. పవర్ గ్రిడ్, డిస్కామ్ లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర సంస్థల అధికారులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు కైలాష్ గెహ్లాట్. గత మార్చిలోనే ఢిల్లీ ప్రభుత్వం ‘విద్యుత్ వాహన’ విధానాన్ని ప్రకటించింది. చాలా మంది సీఎన్జీ వినియోగ కార్లలోకి మారారు. కానీ మరింత కాలుష్య రహిత వాతావరణ పరిధిలోకి రావడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు కైలాష్ గెహ్లాట్.


మారుతీ సుజుకి నుంచి ఇలా డిస్కౌంట్లు  
దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెలలో తన మోడల్స్‌పై రూ.70వేల వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్‌ అందించే మోడల్స్‌లో స్విఫ్ట్‌, ఎర్టిగా, డిజైర్‌ మోడల్స్ ఉన్నాయి. ఈ ఆఫర్‌లో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్‌ చేసే కారు, ఏడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నది కావాలి. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ సర్వీసున్న కార్లకు తక్కువ ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తుంది. కారు అసలు విలువ నుంచి రూ.35 వేల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఆఫర్‌ కింద, ఎర్టిగా పెట్రోల్‌ వేరియంట్‌ రూ.15వేల నగదు డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. డీజిల్‌ వేరియంట్‌పై రూ.20వేల డిస్కౌంట్‌ ఉంది. అదేవిధంగా సీఎన్‌జీ ట్రిమ్‌పై రూ.10వేల డిస్కౌంట్‌ లభిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.30వేలు, రూ.20వేల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కారు వాడిన ఏళ్ల ప్రకారం ఉంటుంది. డీజిల్‌ వేరియంట్‌పై ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లు రూ.35వేలు, రూ.25వేలుగా ఉన్నాయి.  

డిజైర్‌ నుంచి ఆల్టో వరకు ఇలా రాయితీలు
మారుతీ సుజుకీ డిజైర్‌ (పెట్రోల్‌) రెగ్యులర్‌ ఎడిషన్‌పై రూ.20వేల నగదు డిస్కౌంట్‌ లభిస్తుంది. స్పెషల్‌ ఎడిషన్‌పై రూ.27వేల డిస్కౌంట్‌ ప్రకటించింది. ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.20వేల వరకు ఉంది. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ వయసున్న కారు అయితే ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.10వేలకు తగ్గుతుంది. మారుతీ సుజుకి డిజైర్‌ డీజిల్‌ వేరియంట్‌పై రూ.10వేల నగదు డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.20వేల వరకు ఆఫర్‌ చేస్తుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ రెగ్యులర్‌ పెట్రోల్‌ ట్రిమ్‌ వేరియంట్‌పై రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. స్పెషల్‌ ఎడిషన్‌ వేరియంట్‌పై రూ.27వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.20వేల వరకు, ఒకవేళ కారు ఏడేళ్ల కంటే ఎక్కువ వాడి ఉంటే, డిస్కౌంట్‌ రూ.10వేలు తగ్గిపోతుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌(డీజిల్‌)పై రూ.10వేల నగదు డిస్కౌంట్‌ లభిస్తుంది. దాంతో పాటు రూ.25వేల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.  ఆల్టో పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.25వేల నగదు డిస్కౌంట్లను మారుతీ సుజుకీ ఆఫర్‌ చేస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 పెట్రోల్‌ ఎంటీపై రూ.22వేల నగదు డిస్కౌంట్‌ లభ్యమవుతుంది. ఆల్టో కే10 ఏఎంటీపై రూ.27వేల నగదు డిస్కౌంట్‌ను, అన్ని మోడల్స్‌పై రూ.30వేల ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. 

loader