Asianet News TeluguAsianet News Telugu

ట్విన్ ఇంజిన్లతో విపణిలోకి డుకాటీ ‘హైపర్ మోటార్డ్’


ఇటలీ సూపర్ బైక్‌ల తయారీ సంస్థ ‘డుకాటీ’ దేశీయ విపణిలోకి 950 సీసీ సామర్థ్యం గల హైపర్ మోటార్డ్ బైక్‌ను ఆవిష్కరించింది.
 

Ducati drives in Hypermotard 950 in India at Rs 11.99 lakh
Author
New Delhi, First Published Jun 13, 2019, 1:28 PM IST

న్యూఢిల్లీ: ఇటలీ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ.. భారత విపణిలోకి సరికొత్త హైపర్‌మోటార్డ్ 950 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించారు. 

937 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ కలిగిన ఈ బైక్‌లో రెండు ఇంజిన్లు ఉన్నాయి. హైపర్‌మోటార్డ్ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ బైక్‌ను ఆవిష్కరించామని డుకాటీ ఇండియా ఎండీ శర్గీ కెనోవాస్ చెప్పారు. ఫన్‌గా నడిపేందుకు అనువైన బైక్ ఇదని తెలిపారు.

దీంతో నూతన డ్రైవింగ్ అనుభవం కావాలనుకునే యువతియువకులకు ఈ బైక్‌ సరైన ఎంపిక అని డుకాటీ ఇండియా ఎండీ శెర్గి కెనోవాస్ తెలిపారు. రైడర్లను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్‌ను ఆధునీకరించి విడుదల చేశామని ఆయన చెప్పారు. 

హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నైలోని షోరూంలలో ఈ బైక్‌ కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని డుకాటీ ఇండియా ఎండీ శెర్గి కెనోవాస్ సూచించారు. థ్రిల్లింగ్ అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం పూర్తిగా స్పోర్టీగా, ఫియర్ లెస్ క్యారక్టరిస్టిక్స్ ఉన్న మోడల్ బైక్ ఇదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios