బైక్‌ల కొనుగోళ్లపై రూ.10 వేల వరకు డిస్కౌంట్లు!!

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 3, Nov 2018, 12:39 PM IST
Diwali 2018: Best Discounts And Offers On Bikes In India
Highlights

ప్రతియేటా దీపావళి సందర్భంగా కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని అంతా భావిస్తున్నారు. అటువంటి వారికోసం ఆటోమొబైల్ సంస్థలు పలు రాయితీలు, డిస్కౌంట్లు అందజేస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్ ‘పేటీఎం’ దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలతో టైఅప్ అయ్యింది. వివిధ రకాల బైక్‌ల కొనుగోలుపై రూ.10 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

పండుగల సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు పలు రకాల ఆఫర్లు అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి సంవత్సరం మోటార్ బైక్‌ల విక్రయాలు అత్యధికంగా సాగేదీ ఈ పండుగల సీజన్‌లోనే. పలు డీలర్‌షిప్‌లు ఆసక్తికరమైన ఆర్థిక పథకాలను ప్రతిపాదించాయి. పేటీఎం కూడా పలు ఆటోమొబైల్ సంస్థలతో టైఅప్ అయింది కూడా. ఒక్కసారి పరిశీలిద్దాం:

బజాజ్ ఆటో ‘ట్రిపుల్ ఫైవ్’ స్కామ్ 
బజాజ్ ఆటోమొబైల్ వినియోగదారులకు ‘ట్రిపుల్ ఫైవ్’ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా ఐదేళ్ల వారంటీ, ఐదేళ్ల బీమా, కొనుగోలు తర్వాత ఉచితంగా తొలి ఐదు సర్వీసులు అందజేయడం జరుగుతుంది. మీరు బజాజ్ ఆటో బైక్‌లు కొనుగోలు చేయాలనుకుంటే డీలర్లను కలుసుకుని క్యాష్ డిస్కౌంట్లపై చర్చల్లో తేల్చుకోవచ్చు.

హోండాతో పేటీఎం టైఅప్
హోండా మోటార్ సైకిల్స్ సంస్థతో డిజిటల్ వేదిక ‘పేటీఎం’ భాగస్వామిగా మారింది. మీరు పేటీఎం ద్వారా హోండా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. హోండా సంస్థ జాయ్ క్లబ్‌లో ఉచితంగా సభ్యత్వం కల్పిస్తోంది. క్లబ్‍లో సభ్యత్వం పొందిన వారికి రూ.2,500 వరకు బెనిఫిట్లు కల్పిస్తోంది. ఢిల్లీ వాసులకు మూడేళ్లపాటు ఉచితంగా రూ.లక్ష ప్రమాద బీమా అందజేస్తున్నారు డీలర్లు.

పేటీఎంతో హీరో బైక్ కొన్నా రూ.5,000 క్యాష్‌బ్యాక్
పేటీఎం ద్వారా హోండా మోటార్స్ మోటార్ బైక్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.5,000 క్యాష్ బ్యాక్ కల్పిస్తోంది. వీటితోపాటు హీరో ప్లీజర్, హీరో మాస్ట్రో, హీరో డ్యుయట్ కొనుగోళ్లపై రూ.3,000 క్యాష్ రాయితీ కల్పిస్తోంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు అదనంగా రూ.1,000 క్యాష్ డిస్కౌంట్ కల్పిస్తోంది.

టీవీఎస్ మోటార్స్‌తో పేటీఎం టైఅప్.. రూ.5000 వరకు డిస్కౌంట్
టీవీఎస్ మోటార్స్ కంపెనీతోనూ పేటీఎం టైఅప్ అయ్యింది. అపాచీ రేంజీలో గల అన్ని మోటార్ బైక్‌లపై రూ.5000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. టీవీఎస్ జూపిటర్ బైక్‌కు కూడా ఈ క్యాష్ బ్యాక్ అందుతుంది. రేడియాన్, ఎన్ టార్క్‌లకు ఈ పథకం అమల్లోకి రాదు. ఆకర్షణీయ ఆర్థిక పథకాలను ఆఫర్ చేస్తోంది. 

సుజుకి మోటార్ సైకిళ్లపై రూ.1,500 క్యాష్ బ్యాక్
సుజుకి మోటార్స్ సంస్థ తయారు చేసిన అన్ని మోటార్ సైకిళ్లపై రూ.1,500 క్యాష్ బ్యాక్ అందజేస్తోంది. మీ వద్ద పేటీఎం ఓచర్ ఉంటే అదనంగా రూ.5000 క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ఒకవేళ ప్రభుత్వోద్యోగులైతే రూ.2000 రాయితీ, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.1,000 అందుతుంది. మొత్తం టీవీఎస్ మోటార్ బైక్‌లను కొనుగోలు చేసేవారికి రూ.9,500-రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

యమహా మోటార్స్‌పై రూ.4,000 క్యాష్ బ్యాక్
యమహా మోటార్స్ నుంచి మోటార్ బైక్ కొనుగోలు చేసేవారికి పేటీఎం రూ.4000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అంతే కాదు అతి తక్కువగా 8 శాతం వడ్డీపై రుణ పరపతి కల్పిస్తోంది. బయటి ప్రపంచంలో 12 శాతం వడ్డీరేటుపై రుణాలు లభిస్తున్నాయి.

loader