దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గత ఆర్థిక సంవత్సరం సాధించిన వృద్ధిలో కాంపాక్ట్‌ మోడళ్లతోపాటు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్లు స్విఫ్ట్‌, బాలెనో, సెడాన్‌ డిజైర్‌ కార్లు ప్రధాన పాత్ర పోషించాయి. 2018-19లో కంపెనీ దేశీయ విక్రయాల్లో వీటి వాటా 49.7 శాతం ఉండటం విశేషం. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 45.3 శాతంగా ఉంది. 2018-19లో కాంపాక్ట్‌ విభాగంలోని న్యూ వ్యాగన్‌ఆర్‌, ఇగ్నిస్‌, సెలెరియో, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌ మోడళ్లకు చెందిన 8,71,864 కార్లను సంస్థ విక్రయించింది. 

2015 నాటి బాలెనోతోపాటు స్విఫ్ట్, డిజైర్ న్యూ వర్షన్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో కంపెనీ సేల్స్‌లో ప్రైమరీ గ్రోథ్ నమోదు కావడానికి కారణం. కంపాక్ట్ సెడాన్ ‘డిజైర్’ కారు 2017-18లో 2,23,924 యూనిట్లు విక్రయిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 2,40,124 యూనిట్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 5.71 శాతం ఎక్కువ.

స్విఫ్ట్ కార్ల విక్రయాలు 1,78,928 నుంచి 2,23,924 యూనిట్లకు చేరాయి. ఇది 27.28 శాతం పురోగతి. బాలెనో మోడల్ కారు విక్రయాలు 11.47 శాతం పెరిగాయి. 2017-18లో 1,90,480 బాలెనో మోడల్ కార్లు విక్రయిస్తే గతేడాది 2,12,330 యూనిట్ల సేల్స్ జరిగాయి. 

2017-18లో విక్రయించిన 7,48,475 కార్లతో పోలిస్తే ఇది 16.5 శాతం ఎక్కువ. ఇదిలా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో లైట్ కమర్షియల్ వెహికల్ ‘సూపర్ క్యారీ’తోపాటు మొత్తం 17,53,700 వాహనాలను మారుతి సుజుకి విక్రయించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 16,53,500 వాహనాలతో పోలిస్తే ఇది 6.1 శాతం అధికం.

ఆల్టో, ఓల్డ్ వాగన్ ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి 21 శాతం వ్రుద్ది సాధించింది. అంటే 2018-19లో 3,68,990 యూనిట్లను విక్రయించింది. ఆల్టో మాత్రం బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారుగా తిరిగి పేరు సంపాదించుకున్నది. 2017-18తో పోలిస్తే 2018-19లో 2,58,539 కార్ల నుంచి 2,59,401 ఆల్టో కార్లను విక్రయించింది మారుతి సుజుకి. న్యూ వాగన్ ఆర్ రంగ ప్రవేశంతోనే మినీ కార్ల సెగ్మెంట్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. 

ఇక యుటిలిటీ వెహికల్స్.. జిప్సీ, ఎర్టిగా, విటారా, బ్రెజ్జా, ఎస్ - క్రాస్ మోడల్ కార్ల సేల్స్ కలిపి 15.1 శాతం వ్రుద్ధి నమోదు చేశాయి. 2017-18లో యుటిలిటీ వెహికల్స్ సేల్స్ 15.3 శాతం పెరిగింది. 2017-18లో యుటిలిటీ వెహికల్స్ 2,53,759 కార్లు అమ్ముడు పోతే, 2018-19లో 2,64,197 యూనిట్లు అమ్ముడయ్యాయి.