Asianet News TeluguAsianet News Telugu

గ్లోబల్ లీడర్ రాయల్ ఎన్‌ఫీల్డ్: మార్కెట్‌లోకి రెండు బైక్‌లు

ప్రముఖ బ్రాండ్ మోటార్ సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా రెండు మోటార్ బైక్‍లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నుంచి ఇంటర్ సెప్టర్, కాంటినెంటల్ ట్విన్స్ మోటార్ సైకిళ్లను అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేసింది. 

Bullet maker Royal Enfield launches its most ambitious Interceptor and Continental twins in US
Author
New Delhi, First Published Sep 27, 2018, 10:40 AM IST

న్యూఢిల్లీ/ శాన్‌ఫ్రాన్సిస్కో: ఖరీదైన బైకులు తయారు చేసే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రెండు కొత్త మోటార్‌ సైకిల్‌ మోడళ్లను అంతర్జాతీయంగా విడుదల చేసింది. ఇందులో కాంటినెంటల్‌ జీటీ 650 ధర 5,799 డాలర్లు (దాదాపు రూ.4,21,558), ఇంటర్‌ సెప్టర్‌ ఐఎన్‌టీ మోడల్‌ ధర 6,749 డాలర్లు (దాదాపు రూ.4,90,618)గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు మోడళ్లలో ట్విన్‌ 650 సీసీల సామర్థ్యం గల సిలిండర్‌ ఇంజిన్లను అమర్చింది. 

ఈ రెండు మోడళ్ల బైక్‌లు మార్కెట్ లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ విడుదల చేసిన బైక్‌లకంటే ప్రియమైనవని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అత్యంత వచ్చే ఏడాది ప్రారంభం నుంచి భారత్‌, అమెరికా, బ్రిటన్‌, ఐరోపా సహా ప్రధాన మార్కెట్లలో విక్రయాలు ప్రారంభిస్తామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తెలిపింది. 

‘అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందించిన, అభివృద్ధి చేసిన తొలి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులు ఇవే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగేందుకు ఇవి దోహదపడతాయి’ అని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓ సిద్దార్థ లాల్‌ తెలిపారు. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీకి చెందిన చెన్నైలో ఒరగాడమ్‌ ప్లాంట్‌ నుంచి వీటిని ఉత్పత్తి చేయనున్నారు. భారత్‌లో సైతం ఏడాది చివరికి బైక్‌లు అందుబాటులోకి వస్తాయని సిద్ధార్థ లాల్‌ అన్నారు. 

ఈ రెండు కొత్త మోడళ్ల అభివృద్ధయిన వ్యయాలు వివరాలను కంపెనీ బయటపెట్టలేదు. పెద్ద మోటారు బైక్‌లను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వినియోగదారులు కోరుతున్నారని, కొత్త బైక్‌లు వారి డిమాండ్‌ను తీరుస్తాయని రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ సిద్ధార్థ లాల్‌ తెలిపారు. 2010నాటికి కంపెనీ విక్రయాలు దాదాపు 50 వేలైతే. 2017లో వీటి సంఖ్య 8.20 లక్షల వాహనాలకు పెరిగింది.

ఇప్పటివరకు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న తొమ్మిది మోటార్ బైక్‌లతోపాటు 350-500 సీసీ సామర్థ్యం గల ఇంజిన్లతో కూడిన మోటార్ సైకిళ్ల ధరలు రూ.1.2 లక్షల నుంచి రూ.2 లక్షలకు పలుకుతాయి. తాజాగా మిడ్ సైజ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ పరిధిలో రెండు మోటారు సైకిళ్లను ఆవిష్కరించడంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. 

1970లో మార్కెట్‌లోకి ప్రవేశించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలిసారి జంట సిలిండర్ల బైక్‌లను ఆవిష్కరించింది. అంతకుముందు 1948లో మెటౌర్ సంస్థ ట్విన్ సిలిండర్లను ఆవిష్కరించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ సిద్ధార్థలాల్ మాట్లాడుతూ బ్యూటిఫుల్ మోటార్ సైకిళ్ల ఉత్పత్తిపై ద్రుష్టి సారించామన్నారు. పర్యావరణ హితమైన వ్యక్తిగత ప్రయాణానికి అనుకూలమైన రీతిలో మోటార్ బైక్‌లను ఉత్పత్తి చేస్తూ ప్రగతి పథంలో ముందుకు వెళుతోందన్నారు. 

తదుపరి దశ మోటార్ బైక్‌ల తయారీ కోసం వ్యూహాత్మకంగా వెళుతున్నామని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ సిద్ధార్థలాల్ తెలిపారు. అమెరికాలో హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్ స్ట్రీట్ 500 ప్రారంభ ధర 6899 డాలర్లు కాగా, స్ట్రీట్ 750 బైక్ ధర 7599 డాలర్లు ఉంటుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ అధ్యక్షుడు రుద్రతేజ్ సింగ్ మాట్లాడుతూ భారతదేశంలో తమ సంస్థకు 30 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్విన్ సిలిండర్ల ఇంజిన్ బైక్ కు పెక్కు డిమాండ్ ఉంటుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios