న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ సంస్థ భారత మార్కెట్లోకి రెండు ప్రీమియం మోటార్‌ సైకిళ్లను విడుదల చేసింది. ఎఫ్‌-750 జీఎస్‌, ఎఫ్‌-850 జీఎస్‌ అనే పేరుతో వీటిని సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. కొత్త బైక్స్‌ ధరను సంస్థ వరుసగా రూ.11.9 లక్షలు, రూ.14 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌) నిర్ణయించింది. కొత్తబైక్స్‌ శుక్రవారం నుంచి మొత్తంగా తయారైన యూనిట్లు (సీబీయూ) దేశ వ్యాప్తంగా డీలర్లందరి వద్ద లభించనున్నదని బీఎండబ్ల్యూ తెలిపింది. బీఎండబ్ల్యూ ఎఫ్‌750 మూడు వేరియంట్లలో రూ.11.9 లక్షల నుంచి రూ.13 లక్షల ధరల శ్రేణిలోను, బీఎండబ్ల్యూ ఎఫ్‌850 వాహనం మూడు వేరియంట్లలో రూ.12.9 లక్షల నుంచి 14.4 లక్షల మధ్య లభించనున్నదని సంస్థ తెలిపింది. 

ఈ రెండు మోటారు సైకిళ్లు రెండు సిలిండర్లతో దాదాపు 853 సీసీ ఇంజిన్‌తో సంస్థ తయారయ్యాయి. ఈ వాహనాలు ఏబీఎస్‌, ఆటోమెటిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ విధానాలతో రూపొందించారు. న్యూ బీఎండబ్ల్యూ ఎఫ్ 750 జీఎస్, బీఎండబ్ల్యూ ఎఫ్ 850 జీఎస్ మోటార్ సైకిళ్లు అసమాన హెడ్ లైట్లు, జీఎస్ టైపికల్ ఫ్లై లైన్, ఫ్రంట్ జీఎస్ ‘బీక్’, నూతనంగా అభివ్రుద్ధి చేసిన బ్రిడ్జి ఫ్రేమ్, డే టైం రైడింగ్ లైట్, ఎల్ఈడీ హెడ్ లైట్‌తో డిజైన్ చేసింది. రెండు మోడళ్ల మోటార్ సైకిళ్లలో పవర్ ఫుల్ 2 సిలిండర్, 6 స్పీడ్ గేర్ బాక్స్, యాంటీ హోపింగ్ క్లచ్ అమర్చారు. రెండు మోటార్ సైకిళ్లు పూర్తిగా క్లస్టర్ డిజైన్, అనలాగ్ స్పీడ్ మీటర్ కలిగి ఉన్నది. బ్లూ టూత్ ద్వారా యాప్ అవసరం లేకుడా ఫోన్, మీడియా ఫంక్షనింగ్ చేసుకోవచ్చు. బీఎండబ్ల్యూ మోటోరాడ్ కనెక్టెడ్ యాప్ 

జీఎస్టీ రేట్లు తగ్గించండి
మోటార్ల విడి భాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ ను ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎఎస్పీడీఏ) కోరింది. గువాహటిలో శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తదితరులకు వినతి పత్రం సమర్పించింది. మోటారు బైక్‌లపై విడి భాగాలపై 28 శాతం జీఎస్టీ విధించడంతో పరిశ్రమ ఇక్కట్ల పాలవుతోందని ఎఫ్ఏఐఎఎస్పీడీఏ జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ బజాజ్ తెలిపారు. రిటైల్ విడి భాగాలపై జీఎస్టీ విధించడంతో ఆటోమొబైల్ సేల్స్ 25 శాతం తగ్గుతుందన్నారు. మోటారు బైక్‌లు, ఇతర మోటార్ల విడి భాగాలపై జీఎస్టీని 12 శాతం పరిధిలోకి తేవాలని కోరారు. ఇంతకుముందు పలుసార్లు జీఎస్టీ కౌన్సిల్ ను కోరామని చెప్పారు.