బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ భారత మార్కెట్లోకి మరో ప్రీమియం బైక్‌ను విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎఫ్‌850 జీఎస్‌ అడ్వెంచర్‌ బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.15.40 లక్షలు. 853 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ను సంస్థ డీలర్ల నుంచి బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ హన్స్ క్రిస్టియన్ బేర్టెల్స్ మాట్లాడుతూ బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎఫ్ సిరీస్‌లో ప్రీమియం జీఎస్ మోడల్ బైక్‌లు మధ్య తరగతి కుటుంబాల ప్రయాణానికి, సాహసికుల అడ్వెంచర్లకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. 

ఆల్ న్యూ బీఎండబ్ల్యూ ఎఫ్ 850 జీఎస్ అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణతో ప్రీమియం బీఎండబ్ల్యూ మోటరాడ్ శ్రేణిలో పూర్తిగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ హన్స్ క్రిస్టియన్ బేర్టెల్స్ తెలిపారు. ఆఫ్ రోడ్ ఓరియెంటెడ్ టూరింగ్ రైడర్లు, గ్లోబెట్టర్రీస్‌కు ఫర్ ఫెక్ట్ కంపానియన్, ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు దూసుకెళ్లగల బైక్ ఇదొక్కటేనన్నారు. 

లాంగర్ రైడ్స్‌కు బైక్ ఫ్రెండ్లీగా ‘ఎఫ్ 850 జీఎస్’ మోడల్ ఉంటుందని  బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ హన్స్ క్రిస్టియన్ బేర్టెల్స్  చెప్పారు. డబుల్ సీటుతోపాటు వైడర్ ఫుట్ రెస్ట్ లు ఈ బైక్ కు అమర్చారు. ఇంకా అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ గేర్ లివర్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్, ఎల్ఈడీ ఇండికేటర్లు అమర్చారు. 

853 సీసీ 2 సిలిండర్ ఇన్ లైన్ ఇంజిన్‌గా 8250 ఆర్పీఎం వద్ద 95 హెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇది ‘రైన్’, ‘రోడ్’ మోడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో హై డిగ్రీ రైడర్ సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తోంది. 6.5 అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్ ప్టే కలిగి ఉంటుంది. మల్టీ కంట్రోలర్ కలిగి ఉన్న బీఎండబ్ల్యూ మోటరోడ్ ఎఫ్ 850 మోడల్ బైక్ పై రైడ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ స్వీకరించేందుకు యాప్ ఇన్ స్టాల్ చేశారు. మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయడానికి బ్లూటూత్ కనెక్షన్ వసతి కూడా ఉంది.