Asianet News TeluguAsianet News Telugu

నూతన వసంతంలో లగ్జరీ కార్ల ఎంట్రీకి ఇలా రంగం సిద్ధం!


భారత ఆటోమొబైల్ కార్ల రంగంలో 2019 ఒక మైలురాయి కానున్నది. విలాసవంతమైన కార్ల ఆవిష్కరణకు వేదిక కానున్నది.

Best luxury cars set to roll out in 2019
Author
New Delhi, First Published Dec 13, 2018, 5:06 PM IST

న్యూఢిల్లీ: భారతదేశంలో విలాసవంతమైన కార్ల మార్కెట్ నూతన స్థాయికి చేరుకోనున్నది. ఇప్పటివరకు భారతీయులెవ్వరూ విలాసవంతమైన కార్ల కోసం దుబారా ఖర్చు చేయలేదు. అధిక స్పీడ్ కార్ల పట్ల ఇండియన్లలో క్రేజీ పెరిగిపోతోంది. 

2017లో భారత మార్కెట్‌లో 39 వేల కార్లు అమ్ముడి పోయాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటి వరకు విలాసవంతమైన కార్లు 20 వేలు అమ్ముడుపోయాయి. ఈ క్రమంలో 2019లో మార్కెట్లోకి పలు విలాసవంతమైన కార్లు రానున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం

మైక్ లారెన్ ‘స్పీడ్ డయల్’
ఎఫ్1 సూపర్ కారు ‘స్పీడ్ డయల్’ను మార్కెట్లోకి ఆవిష్కరణకు మైక్ లారెన్ సంస్థ వచ్చే ఏడాది బ్రేక్ చేసేందుకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నది. ‘స్పీడ్ డయల్’ తయారు చేయాలన్న టాస్క్ అంత తేలిక్కాదు. అందునా మైక్ లారెన్స్ సంస్థలో స్పీడ్ డయల్ తొలి హైపర్ జీటీ కారు. అత్యంత ఏరోడైనమికల్‌గా సమర్థవంతమైన కారు కానున్నది. 1050 బీహెచ్పీతోపాటు 12.8 సెకన్లలో గంటకు 300 కి.మీ. వేగం అందుకుంటుంది. 

ఫెర్రారీ 488 పిస్టా స్పైడర్
ఫెర్రారీ 488 పిస్టా స్పైడర్ మోడల్ కారు అత్యంత శక్తిమంతమైనదిగా ఉంది. ఈ ఇటలీ ఆటోమేకర్ అత్యుత్తమ టెక్నాలజీ సొల్యూషన్లతో ఎన్ ప్లెయిన్ ఎయిర్ డ్రైవింగ్‌లా వినోదాన్ని అందిస్తుంది. 488 చాలెన్ ఫీ, 488జీటీఈ మోడల్ కార్లకు అత్యాధునికమైంది. మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది.

అవెంటాడోర్ ‘ఎస్వీజే’
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘిని’ 720 ఎన్ఎంతోపాటు 6.750 ఆర్పీఎం టార్చి గల అవెంటాడోర్ ఎస్వీజే మోడల్ కారును ఆవిష్కరించనున్నది. కార్బన్ పైబర్‌తో తయారైన లైట్ వెయిట్ మెషిన్, నూతన యాక్టివ్ ఏరో డైనమిక్స్ సిస్టమ్ రూపుదిద్దుకున్నదీ కారు. వచ్చే ఏడాది శరవేగంగా దూసుకెళ్లగల లంబోర్ఘినిస్ కార్లలో ఒకటిగా అవెంటాడోర్ ఎస్వీజే ఒకటిగా నిలువనున్నది. దీని ధర 5,17,770 డాలర్లకు అందుబాటులో ఉంటుంది. అయితే 990 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని లంబోర్ఘినీ లక్ష్యంగా చేయనున్నది.
 
జాగ్వార్ ఐ- పేస్
వచ్చే ఏడాది మార్కెట్లో రంగ ప్రవేశం చేయనున్నది మరో విద్యుత్ కారు అదీ జాగ్వార్ ఐ-పేస్. 696ఎన్ఎం ఇన్‌స్టంట్ టార్చ్, స్పోర్ట్స్ కారుగా ఇది నిలుస్తుంది. 300 మైళ్ల రేంజి వరకు వేగంగా దూసుకు వెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎస్‌యూవీ మోడల్ కారైన జాగ్వార్ కారు ధర విషయంలో ఒక మెట్టుపైనే ఉంది. తన కస్టమర్ పునాదిని విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జాగ్వార్ ‘ఐ-పేస్’ ధర 80,500 డాలర్లు పలుకుతోంది. 

టెస్లా రోడ్‌స్టర్ 
ఎలోన్ మస్క్ రూపొందించిన మానస పుత్రిక టెస్లా రోడ్‌స్టర్. 1.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుని గరిష్ఠంగా గంటకు 200 మైళ్ల వేగంతో పరుగులు తీస్తున్నది. ఒక్కసారి విద్యుత్ చార్జింగ్ చేస్తే 620 మైళ్ల నుంచి 997 మైళ్ల వరకు ప్రయాణించవచ్చు. 50 వేల డాలర్లు డిపాజిట్ చేయడంతోపాటు రెండు లక్షల డాలర్లు ఖర్చు చేయగల సామర్థ్యం ఉంటే టెస్లా రోడ్ స్టర్ కారు పొందొచ్చు. ఈ కారులో నలుగురు హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios