Asianet News TeluguAsianet News Telugu

టెల్సా పాలో ఆల్టో లక్ష్యం: మార్కెట్‌లోకి ‘ఆడి’ ‘ఈ-ట్రోన్’

టెల్సా పాలో ఆల్టో లక్ష్యం: మార్కెట్‌లోకి ‘ఆడి’ ‘ఈ-ట్రోన్’

Audi launches electric SUV in Tesla's backyard, with assist from Amazon
Author
San Francisco, First Published Sep 20, 2018, 10:18 AM IST

శాన్‌ఫ్రాన్సిస్కో: జర్మనీ లగ్జరీ కారు బ్రాండ్ ‘ఆడి’ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘ఈ-ట్రోన్’ కారును ఆవిష్కరించింది. ప్రత్యర్థి సంస్థ టెల్సా‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఆడి ‘ఈ-ట్రోన్’ మోడల్ కారు తయారీకి డిజిటల్ మేజర్ ‘అమెజాన్’ ఆర్థికపరమైన చేయూతనిచ్చింది. ఆడి ‘ఈ-ట్రోన్’ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారు అమెరికాలో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 75,795 డాలర్లకు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. దీనిపై 7,500 డాలర్ల టాక్స్ రాయితీ లభించనున్నది.  

యూరోపియన్ ప్రీమియం బ్రాండ్స్‌లో ఒక్కటైన వోక్స్ వ్యాగన్ ఏజీ బ్రాండ్స్ నుంచి మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాల్లో ‘ఆడి ఈ-ట్రోన్’ మోడల్ కారు ఒకటి. డయిమర్ యాజమాన్యంలోని మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, వోల్వో కార్స్, జాగ్వార్ లాండ్ రోవర్ మోడల్ కార్లు ‘విద్యుత్ వాహన’ రంగంలోకి రానున్నాయి. 

కార్ల తయారీ సంస్థలన్నీ ‘ప్రీమియం విద్యుత్ వాహనాల’ మార్కెట్‌ను విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. కాలిఫోర్నియా కేంద్రంగా కార్లు ఉత్పత్తి చేస్తున్న టెస్లా సంస్థ మోడల్ కారు పాలో ఆల్టో మార్కెట్ వాటాను కొట్టేయాలని ఈ సంస్థలన్నీ ఆశగా ముందుకు సాగుతున్నాయి. ఆడి అమెరికా అధ్యక్షుడు స్కాట్ కౌగ్ మాట్లాడుతూ అమెరికా అంతటా విద్యుత్ వాహనాల విక్రయంలో ఆడి ముందు ఉండాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.  

ఆడి, దాని సొంత సంస్థ వోక్స్ వాగన్ కారు ఎస్ యూవీ మోడల్ కారు ‘ఈ-ట్రోన్’ను వచ్చే ఏడాది అమెరికాలో మార్కెట్ లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. విద్యుత్ వాహనాల విక్రయానికి ఏకైక అడ్డంకి అయిన సదరు కార్ల బ్యాటరీ రీచార్జీ మార్గాలను అన్వేషించాలని భావిస్తోంది. అంతేకాదు ఆన్ లైన్ రిటైలర్ సంస్థ ‘అమెజాన్’ కూడా తన భాగస్వామిగా మార్చుకున్నది ‘ఆడి’. 

ఆడి - వోక్స్ వ్యాగన్ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన ‘ఈ-ట్రోన్’ హోం ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ వ్యవస్థలను ఆన్ లైన్ రిటైలర్ అమెజాన్ విక్రయించడంతోపాటు ఇన్‌స్టాల్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. హార్డ్ వేర్ డెలివరీతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సిస్టమ్స్ ఇన్‌స్టలేషన్ చేసేందుకు ఎలక్ట్రిషియన్లను నియమించుకోనున్నది. 

అమెజాన్ హోం సర్వీసెస్ డైరెక్టర్ పాట్ బిగాటెల్ మాట్లాడుతూ ‘హోం చార్జింగ్ సిస్టమ్స్ ఇన్‌స్టలేషన్ కూడా ఒక ముఖ్యమైన బిజినెస్ అని మేం భావిస్తున్నాం’ అని చెప్పారు. ఆడి ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ ఇళ్లలో ఎలక్ట్రిక్ సిస్టమ్ ను ఆధారపడి హోం చార్జింగ్ స్టేషన్స్ ఇన్ స్టలేషన్ కోసం 1000 డాలర్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఆడి ప్రత్యర్థి బ్రాండ్ టెల్సా విద్యుత్ చార్జింగ్ వ్యవస్థలను 500 డాలర్లకే అందుబాటులోకి తెస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios