Asianet News TeluguAsianet News Telugu

త్వరలో విపణిలోకి సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250: హోండా సీబీఆర్, యమహా ఫాజర్‌లకు సవాల్


జపాన్‌కు చెందిన సుజుకి మోటార్స్ త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న గిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడల్ బైక్.. ప్రత్యర్థి సంస్థలు హోండా సీబీఆర్, యమహా ఫాజర్, బజాజ్ పల్సర్ తరహా మోటారు సైకిళ్లతో పోటీ పడనున్నది. పలు ప్యాకేజ్డ్ ఆఫర్లతో విపణిలోకి రానున్న సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర రూ.1.70-రూ.1.75 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2019 Suzuki Gixxer SF 250: Price Expectation
Author
New Delhi, First Published May 20, 2019, 11:31 AM IST


న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి ఆధ్వర్యంలో 250 సీసీ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ‘గిక్సర్ ఎస్ఎఫ్ 250 ఏబీఎస్’ మోడల్ బైక్ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఇంతకుముందు సుజుకి విడుదల చేసిన ఇనాజుమా 250 మోడల్ బైక్ ట్విన్ మోటార్స్‌తో విడుదల చేసినా తర్వాత ధర తగ్గించినా పెద్దగా కొనుగోళ్లు జరుగలేదు. దీంతో బైక్ ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నది సుజుకి. 

గిక్సర్ ఎస్ఎఫ్ 250 గణనీయమైన ఆఫర్లతో విపణిలోకి వస్తోంది. సుజుకీ మోటార్స్ సంస్థకు గిక్సర్ ఎస్ఎఫ్ 250 గేమ్ చేంజర్‌గా భావిస్తున్నారు. దీని ధర కూడా మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. 

2019 సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 ఏబీఎస్ ప్రత్యర్థి సంస్థలు హోండా సీబీఆర్ 250 ఆర్, యమహా ఫాజర్ 25, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 మోడల్ మోటారు సైకిళ్లతో పోటీ పడనున్నది. బజాజ్ పల్సర్ బైక్ ఇప్పటికీ కాంపిటీటివ్‌గానే ఉంది. 

సుజుకి గిక్సర్  ఎస్ఎఫ్ 250 మోడల్ బైక్ ధర రూ.1.70-రూ.1.75 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. యమహా ఫాజర్, హోండా సీబీఆర్ మోడల్ బైక్‌లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. హోండా సీబీఆర్ మోడల్ బైక్ ధరతో పోలిస్తే సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర తక్కువగా ఉంటుందని అంచనా. 

ఇక సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్‌తో పోలిస్తే యమహా ఫాజర్, బజార్ పల్సర్ బైక్‌లకు లెస్ పవర్ ఉంటుందని నిపుణుల అంచనా.  జీఎస్ఎక్స్, ఎంట్రీ లెవెల్ గిక్సర్ 155 సిరీస్ బైక్‌ల మధ్య గ్యాప్‌ను సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్ పూడ్చేస్తుందని చెబుతున్నారు. 

సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్ పూర్తి ప్యాకేజ్డ్ ఆఫరింగ్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, స్ప్లిట్ సీట్స్, డుబుల్ బారెల్ ఎగ్జాస్ట్, 17 అంగుళాల డబుల్ స్పోక్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆయిల్ కూల్డ్ ఇంజిన్, పీక్ టార్చ్ ఆఫ్ 22.6 ఎన్ఎం, 26 బీహెచ్పీ సామర్థ్యం గల శక్తిని విడుదల చేస్తుంది. 6 -స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. రేర్ డ్యూయల్ చానెల్ ఏబీఎస్, డిస్క్ బ్రేక్స్ హ్యాండ్లింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios