Asianet News TeluguAsianet News Telugu

ఆధునికత: మార్కెట్‌లోకి ఐదు వెస్పా కొత్త స్కూటర్లు

ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ సంస్థ పియాజియో ఐదు ఆధునీకరించిన స్కూటర్లను ఆవిష్కరించింది. నూతన ఫీచర్లను చేర్చి మరీ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన పియాజియో.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తామేమీ వెనుకబడలేదని సంకేతాలిచ్చింది.

2018 Aprilia SR 150 scooter launched, prices start at Rs 70,031
Author
Mumbai, First Published Sep 19, 2018, 10:33 AM IST

ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్‌ సంస్థ పియాజియో ఐదు ఆధునీకరించిన కొత్త స్కూటర్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. కంపెనీ వెస్పా, అప్రిలియా బ్రాండ్లలో ఐదు కొత్త మోడల్ స్కూటర్లను విడుదల చేసింది.

150 వెస్పా రేంజీలో ఎస్సెక్స్‌ఎల్‌, వీఎక్స్‌ఎల్‌ను ఆధునీకరించి రెండు కొత్త రంగులు, మోడళ్లతో అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ఎస్సార్‌ 150 రేస్‌ ఎడిషన్‌ స్కూటర్‌ను ఆవిష్కరించింది. వీటికి తోడు సంస్థ వెస్పా నొట్టీ మోడల్‌ను తెచ్చింది. ఆప్రిలియా ఎస్సార్ 150 మోడల్ స్కూటర్ ధర రూ.70,031గా నిర్ణయించారు. 

ఆప్రిలియా ఎస్సార్‌ 150 కార్బన్‌ను లిమిటెడ్‌ ఎడిషన్‌నూ సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘అప్రిలియా ఎస్సార్‌ 150 రేస్‌’ ధరను కంపెనీ రూ.80,211, ఎస్సార్ కార్బన్ ధర రూ.73,500గానూ, కొత్త వెస్పా వీఎక్స్‌ఎల్‌ ధరను రూ.91,140, ఎస్‌ఎక్స్‌ఎల్‌ 150 సీసీ ధరను రూ.97,276 నిర్ణయించింది. రూ.125 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన వెస్పా నొట్టీ ధర రూ.68,829గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. 

తొలిసారి న్యూఢిల్లీ నగర శివారులో నిర్వహిస్తున్న ‘ఆటో ఎక్స్ పో’లో వీటిని ప్రదర్శించింది. ఎస్సార్ 150 రేంజి మోడల్ స్కూటర్‌లో అనాలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, అండర్ సీట్ యూఎస్బీ చార్జింగ్ పోర్ట్‌కు తోడు అడ్జస్టబుల్ షాక్ అబ్సార్బర్స్, న్యూ వైండ్ షీల్డ్ అదనపు ఆకర్షణ కానున్నాయి.  

ఆప్రిలియా ఎస్సార్ 150 ఫేస్ లిఫ్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్‌లోకి బ్లూ, గ్రే కలర్లలో రానున్నది. ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌తోపాటు ఎల్సీడీ స్క్రీన్ కూడా చేర్చారు. దీనికి 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, 220 మి.మీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ కూడా కొత్తగా అధునాతనంగా రూపొందించారు. త్రీ వాల్యూ ఇంజిన్, 150సీసీ సామర్థ్యం అప్రిలియా ఎస్సార్ 150 స్కూటర్ పవర్ ట్రైన్‌లో ఎటువంటి మార్పు లేదు. 

ఆప్రిలియా సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిల్ స్ఫూర్తితో లిమిటెడ్ ఎడిషన్ ఆప్రిలియా కార్బన్ ఎస్సార్ 150 స్కూటర్లు తయారు చేసిన పియాజియో కార్బన్ కంపోనెంట్స్ రూపొందించింది. మోటోజీపీ రేసింగ్ కోసం తయారు చేసిన ఆర్ఎస్-జీపీ సూపర్ బైక్ స్ఫూర్తితో న్యూ ఆప్రిలియా ఎస్సార్ 150 రేస్ స్కూటర్ తయారైంది.

వైట్ స్కూటర్ రెడ్ అండ్ గ్రీన్ ఆర్ఎస్- జీపీ థీమ్‌తో రూపొందించింది. రెడ్ పెయింటెడ్ అల్లాయిస్, గోల్డెన్ బ్రేక్ కాలిపర్, టాల్ ఫ్లై స్క్రీన్ కూడా ఉంటుంది. పియాజియో మరో మూడు మోడల్ స్కూటర్లు - మాట్ట్ రోస్సో డ్రాగన్, మాట్ట్ ఎల్లో, అజ్జూరో ప్రొవెంజాలను మార్కెట్‌లో ఆవిష్కరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios