హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ దిగ్గజం ‘పియా జియో’ మంగళ వారం రెండు సరి కొత్త స్కూటర్లను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఏప్రిలియా స్ట్రామ్‌-125, వెస్పా అర్బన్‌ క్లబ్‌ వేరియంట్‌ స్కూటర్‌ను సంస్థ హైదరాబాద్‌లో విడుదల చేసింది. కంపెనీ టూవీలర్స్‌ బిజినెస్‌ హెడ్‌ అశీష్‌ యక్మీ ఈ కొత్త వాహనాలను ఆవిష్కరించారు. 

పియాజియో టూవీలర్స్ బిజినెస్ హెడ్ అశీష్ యక్మీ మాట్లాడుతూ ఏప్రిలియా స్కూటర్లను విప్లవాత్మక సాంకేతికతతో తీర్చిదిద్దామన్నారు. దీని ధరను రూ.65,000గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిలియా బ్రాండ్ పూర్తిగా రిచ్ ఇటాలియన్ హెరిటేజ్, చాంపియన్ డీఎన్ఎ, డిజైన్ ఆస్థటిక్స్‌ను కలిగి ఉంటుంది. 

అంతేకాదు.. ఏప్రిలియా ఎస్‌ఆర్‌125తో పోలిస్తే దీని ధర దాదాపు రూ.8000 తక్కువ. 12 అంగుళాల ట్యూబ్‌లెస్‌ టైర్లు, 124.9 సీసీ ఎయిర్‌కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ మోటర్‌, సీవీడీ ట్రాన్స్‌మిషన్‌, డ్రమ్‌ బ్రేక్స్‌, 6.5 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో అందుబాటులోకి తెచ్చామని టూవీలర్స్‌ బిజినెస్‌ హెడ్‌ అశీష్‌ యక్మీ వివరించారు. 

మరోవైపు ఆధునిక పీచర్లతో వెస్పా అర్బన్‌ క్లబ్‌ వేరియంట్‌ వాహనాన్ని పియాజియో మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.72,774గా కంపెనీ నిర్ణయించింది.  వెస్పా, ఏప్రిలియా బ్రాండ్ల‌తో మార్కెట్లో వాహనాలను విక్రయిస్తోందని పియాజియో టూవీలర్స్‌ బిజినెస్‌ హెడ్‌ అశీష్‌ యక్మీ తెలిపారు. గత రెండేళ్లలో తమ కంపెనీ అమ్మకాల్లో 32 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని తెలిపారు. 

తమ వాహనాలు అందుబాటులో ఉన్న 125, 150 సీసీ విభాగాల్లో  10-15 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నదని పియాజియో టూవీలర్స్‌ బిజినెస్‌ హెడ్‌ అశీష్‌ యక్మీ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 25 పైగా డీలర్‌షిప్‌లు కలిగి ఉన్నామన్నారు. వచ్చే నాలుగైదు నెలల్లోనే మరో 20 డీలర్‌షిప్‌లను కొత్తగా అందుబాటులోకి తేనున్నట్టుగా వివరించారు.

పియాజియో ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ డైగో గ్రాఫీ ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ భారతం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని చెప్పారు. తమ బ్రాండ్లకు లభిస్తున్న స్పందన తమకు ఆనందం కలిగిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం టూ వీలర్ వెహికల్స్ పట్ల డిమాండ్ పెరుగుతోంది. పియాజియో ఏప్రిలియా, వెస్పా అర్బన్ క్లబ్ స్కూటర్లకు హైదరాబాద్ నగరంలో సానుకూల స్పంద లభిస్తున్నదని డైగో గ్రాఫీ చెప్పారు.