డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో, వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు నూతన మిత్రుల పరిచయలు ఉంటాయి. ఇంటా బయటా సమస్యలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహా, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్యాహం లభిస్తుంది. అనుకోని బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడినా వివాదాలు తీరి ఊరట చెందుతారు. శ్రమ మీది ఫలితం వేరొకరిది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రముఖలతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. నూతన, వస్తు, ఆభరణాళు కొనుగోలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. దీర్ఘాకలిక రుణాలు కొంత వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. సంతానం నుంచి ధన సహాయసాకారాలు అందుతాయి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలుగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఆకస్మిక, ధనలాభం, రాజీకయ పారిశ్రామిక రంగాల్లోని వారికి సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కొత్త పనులు, వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు, వివాహ యత్నాలు ఫలిస్తాయి. భూ, వివాదాలు, తీరి లబ్ది పొందుతారు. కాలం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. పనులు చక చకా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. బాధ్యతలు పెరిగినా సకాలంలో నిర్వహిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. సన్నిహితుల నుంచి సహాయ సాకారాలు అందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సన్నిహితుల సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సుఖ, సౌఖ్యాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ఫలితం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు పారిశ్రామిక, రాజకీయ నాయకులకు ఊహించని, సన్మానాలు పొందుతారు. ఆనందోత్సాహంతో కాలాన్ని గడుపుతారు. శత్రు పీడ తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా వారితో సమయాన్ని గడుపుతారు. కార్య జయం ఉంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు గృహ నిర్మాణ ఆలోచనలు తొందరపాటు పనికిరాదు. ఇంటా బయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కీర్తి పెరుగుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.