Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 09 సెప్టెంబర్ 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పని మార్పిడి వస్తే బహిరంగంగా చేయండి. భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది. చాలా బిజీగా సమయాన్ని గడుపుతారు. ఉరుకుల పరుగులగా ఈ రోజు మీకు సాగుతుంది. 

today dinaphalithalu 9th september 2020
Author
Hyderabad, First Published Sep 9, 2020, 7:14 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

today dinaphalithalu 9th september 2020

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు పాత స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్నని గడుపుతారు. గ్రహాల ప్రభావం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది. బ్యాంక్ నుంచి రుణం పొందాలనుకుంటే అందుకు ఈ సమయం సరైనది కాదు. ఎందుకంటే నేడు రుణం పొందడం కష్టతరంగా ఉంటుంది. ఈ రోజు మీరు జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుంచి ప్రయోజనం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు పని మార్పిడి వస్తే బహిరంగంగా చేయండి. భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది. చాలా బిజీగా సమయాన్ని గడుపుతారు. ఉరుకుల పరుగులగా ఈ రోజు మీకు సాగుతుంది. కాబట్టి కొంచెం విశ్రాంతి అవసరం, స్థిరంగా వాహనాన్ని నడపండి. నిలిచిపోయిన పనులు, వ్యవహారాలు ఈ రోజు పూర్తవుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల మీరు ఆధ్యాత్మికతపై విశ్వాసం బలపడుతుంది. మీకు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చును నియంత్రించండి. సామాజిక కార్యాల్లో పాల్గొనడం మంచిది. ఫలితంగా జనుల గౌరవం పొందుతారు. సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు ఉంటాయి. వినోదంతో మీరు గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేసి ప్రయోజనం పొందుతారు. సంతానంపై విశ్వాసం బలంగా ఉంటుంది. డాబు కోసం మీరు చేసే ఖర్చు మీ శత్రువులను కలవరపెడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. చేపట్టే పనులు, వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా అధిగమిస్తారు.
పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. కుటుంబంలో వైపు నుంచి కొన్ని గొడవలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఫలితంగా ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మానసిక క్షోభ, ఆందోళన, ఉదాసీనత లాంటివి కలుగుతాయి. వీటి వల్ల మీ మనస్సు నిలకడగా ఉండదు. కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నట్లయితే అందులో మెరుగుదల కచ్చితంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. మీకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా మీ పనులు పూర్తి చేస్తారు. మీకు మీ తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు ఇస్తుంది. కొంత శారీరక బాధ కారణంగా మీ జీవిత భాగస్వామికి చికాకు వస్తుంది. అనవసర వ్యయాలు ఉంటాయి. మీరు మీకు హృదయానికి నచ్చిన వ్యక్తుల గురించి బాగా ఆలోచిస్తారు. అయితే వారు మీ నిస్సహాయతను స్వార్థమని భావిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మనస్సు మంచి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. కుటుంబం నుంచి సహకారం అందుతుంది. మీ అదృష్టానికి పూర్తి మద్దతు ఉంటుంది. మీరు ఇతరుల సేవలో నిమగ్నమై ఉంటారు. మీరు చేపట్టిన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. గురువు పట్ల పూర్తి గౌరవాన్ని కలిగి ఉంటారు. మీ విధేయతను చూపిస్తారు. మీరు నూతన పెట్టుబడులు పెట్టే అవకాశముంటుంది. అంతా శుభప్రదంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మనస్సు కొన్ని కారణాల వల్ల నిరాశ చెందుతుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం కావు. స్నేహితులకు మీతో సమస్యలు ఉండవచ్చు. కోర్టు కేసులు కూడా ఈ రోజు పరిష్కారమవుతాయి.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికాంశాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. విరాళాల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబంలో శాంతి, ఆనందం కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కాబట్టి తినే పదార్ధాలపై జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆహారం విషయంలో సంయమనం పాటించడం ఉత్తమం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వ్యాపారవేత్తలు, ఉద్యోగస్థులకు లాభసాటిగా ఉంటుంది. ఆగిపోయిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. మీరు ఏదైనా నూతన పథకంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే సరైన సమయం. మిశ్రమ ఫలితాలుంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు డబ్బు కోరుకోకుండా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. పరిమితమైన లేదా అనవసరమైన వాటిని మాత్రమే ఖర్చు చేస్తారు. ఎవరైనా మోసం చేసే అవకాశముంది. సమీప ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అంతా ప్రయోజనకరంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీరు కార్యాలయంలో ప్రశంసలు కూడా పొందుతారు. గౌరవంతో పాటు సామాజిక ధైర్యం పెరుగుతుంది. మీకిష్టమైన వారి నుంచి వినోదాన్ని అందుకుంటారు. మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆలస్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ప్రవర్తనతో ప్రజలను మీ వైపు ఆకర్షిస్తారు. మీతో సంబంధాన్ని పెంచుకోవడం గురించి మీరు ఆలోచిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios