Asianet News TeluguAsianet News Telugu

today astrology: 30 ఏప్రిల్ 2021 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి

today dinaphalithalu 30th april 2021
Author
Hyderabad, First Published Apr 30, 2021, 7:11 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 30th april 2021

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పనుల్లో విజయం. శుభకార్యాల నిర్ధారణ. బంధువులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు అనుకూలిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చర్చల్లో పురోగతి. పనులు అనుకున్న విధంగా పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. మిత్రులతో సఖ్యత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios