Asianet News TeluguAsianet News Telugu

today astrology: 2 సెప్టెంబర్ 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి ధన లాభం పొందుతారు. ముఖ్య నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. 

today dinaphalithalu 2nd september 2020
Author
Hyderabad, First Published Sep 2, 2020, 7:10 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 2nd september 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీలో మనోధైర్యాన్ని పెంచుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి ధన లాభం పొందుతారు. ముఖ్య నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ లభిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సరైన సమయానికి మీరు ప్రారంభించిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ముందు చూపుతో వ్యవహారిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భాగస్వామి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విందు, వినోదాల్లో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కొత్త మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు బంధువులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు, మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతాయి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు అనవసర వివాదాల్లో తలదూర్చకపోతే మంచిది. అవసరమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఓ శభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు అనుకున్న సమయానికి అనుకున్న పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఓర్పు సహనంగా ఉంటే మంచిది. అన్ని సవాళ్లను దిగ్విజయంగా అధిగమిస్తారు. మంచి పనులు చేయడానికి సరైన సమయం. అయితే విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఫలితాగం కొంత వేదనకు గురవుతారు. కొత్త ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఇంట్లో గొడవల్లో అనసరంగా తలదూర్చకండి. వాహన కొనుగోలు ఉంటుంది. మరమ్మత్తులకు ఖర్చు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని విధంగా మీ పని ప్రదేశంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. రాజకీయ నాయకులకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి కలిసి వస్తుంది. పనితీరులోనూ మార్పు కనిపిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. వివాహం కోసం చూస్తున్నవారికి ఈ రోజు శుభవార్త వింటారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు సహకారం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఫలితంగా భవిష్యత్తులో మీకు ప్రయోజనం ఉంటుంది. చేపట్టే పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వాధికారులకు ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios