Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 02 ఏప్రిల్ 2021 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. 

today dinaphalithalu 2nd april 2021
Author
Hyderabad, First Published Apr 2, 2021, 7:11 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 2nd april 2021

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. భూలాభాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు తప్పవు. అంచనాలు తారుమారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయాల సందర్శనం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు  కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనుల్లో తొందరపాటు. ఆరోగ్య,కుటుంబ సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు భూ, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో విభేదాలుతొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. చర్చలు సఫలం. ప్రముఖుల పరిచయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్య,కుటుంబసమసమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. శ్రమ మరింత పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కాంట్రాక్టర్లకు అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన కష్టంఫలిస్తుంది. భూలాభం. యత్నకార్యసిద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక ప్రగతి ఉంటుంది.దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. చర్చలు ఫలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితులసాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులుతొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఎంతకష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. బంధువుల నుంచి విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. విద్యార్థులకు శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు బంధువులతో వైరం. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు చికాకుపరుస్తాయి. మీ అంచనాలు తప్పుతాయి. బాద్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios