Asianet News TeluguAsianet News Telugu

today astrology: 29 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు నూతన మిత్రుల సలహా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగయోగం ఉంటుంది.

today dinaphalithalu 29th august 2020
Author
Hyderabad, First Published Aug 29, 2020, 7:06 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 29th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య, వాహానాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. నూతన విద్యలపై ఆసక్తి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.  సమయానుకూలంగా ముందుకు సాగితే మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు నూతన మిత్రుల సలహా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగయోగం ఉంటుంది. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలకు కలిసి వచ్చే కాలం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు  జీవిత భాగస్వామి నుంచి లాభం పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించి వేసే ప్రణాళికల్లో స్పష్టత వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు.సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడుతాయి. వీలైనంతవరకు వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు అనవసర విషయాల్లో తలదూర్చకండి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. 
కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు  ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వస్తులాభం ఉంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వీలైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. నూతన ఒప్పందాల్లో తొందరపాటు వద్దు. జీవిత బాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మిత్రుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. అపార్థాలకు తావివ్వకండి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. రుణాలు తీరుతాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సన్మానయోగం ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు  ఆత్మ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యముంటుంది.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios