డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం వాహనాల విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. అనుకూల ఫలితాలున్నాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. రుణబాధలు తొలుగుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ప్రముఖుల కలయిక ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు దూరప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల్లో వారికి సన్మాన యోగం ఉంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కీలకమైన పనులు కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు  దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. పనుల్లో అవాంతారాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వీలైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సోదరులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు తొలుగును. ముఖ్యమైన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. నూతన మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథులను కలిసి కీలక విషయాలు తెలుసుకుంటారు. నూతన వస్తువుల కొనుగోలు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు కీలక నిర్ణయాల్లో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కుటుంబ సభ్యుల సహాయ సాకారాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వీలైనంతవరకు వివాదాలకు, చికాకులక దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. ఆపదలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు బుద్ధి బలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. చేపట్టే పనులు, ప్రారంభించిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యముంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.