Asianet News TeluguAsianet News Telugu

today astrology: 27 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది.

today dinaphalithalu 27th August 2020
Author
Hyderabad, First Published Aug 27, 2020, 7:04 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 27th August 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలలో కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఆత్మీయులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు స్వల్ప మార్పులు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. శ్రమ పెరుగుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా సన్నిహితుల సహాయం అందుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు సంఘంలో విశేష ఆదరణ, వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో ఏర్పడిన ఒడిదుడుకులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు  ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారంతో ఆనందం కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు పనుల్లో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios