Asianet News TeluguAsianet News Telugu

today astrology: 26 ఏప్రిల్ 2021 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ రోజు ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

today dinaphalithalu 26th april 2021
Author
Hyderabad, First Published Apr 26, 2021, 7:10 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 26th april 2021

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలబ్ధి. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కాస్త అనుకూలత. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు  కార్యక్రమాలలో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. కాంట్రాక్టులు చేజారతాయి. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొంత ఊరట. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థికపరంగా ఆశాజనకం. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. భూవివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం.  కార్యజయం. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో వ్యయప్రయాసలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు కొత్త కార్యక్రమాలు  చేపడతారు. ధన, వస్తులాభాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ప్రయాణాలలో ఆటంకాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో  కలహాలు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారాలు ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. పనుల్లో  అవాంతరాలు. అనారోగ్య సూచనలు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ధనలబ్ధి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios