వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కొంతమేరకు మీకు ప్రయోజనాలుంటాయి. నిలిచిపోయిన లేదా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పెట్టుబడిలో మీరు లాభం అందుకుంటారు. కుటుంబంలో పరస్ఫర ప్రేమ ఉంటుంది. ఫలితంగా ఆనందంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకరమైన ఖర్చులు ఉంటాయి. సంతానం నుంచి సంతృప్తి లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు మీరు ప్రయోజనం పొందుతారు. అంతే కాకుండా మీరు సంతోషం పొందుతారు. ఫలితంగా గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు. మీకు మనశ్శాంతి లభిస్తుంది. గొప్ప వ్యక్తుల పరిచయంతో ప్రయోజనం అందుకుంటారు. ఆర్థికపరంగా మీకు లాభం చేకూరుస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఏ సందర్భంలోనైనా ఇతరుల నుంచి నష్టం వాటిల్లుతుంది. కొన్ని కారణాల వల్ల శత్రువుల నుంచి హాని కలుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఈ రోజుతో ముగుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్ఫర అవగాహన పెరుగుతుంది. ప్రజలకు ఆనందం కలుగుతుంది. మానసిక ఆనందం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు గ్రహాల శుభ ప్రభావంతో వ్యాపార విస్తరణ చేస్తారు. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో లాభం పొందడం ద్వారా నిధులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మాట వింటారు. సాయంత్రం సమయంలోగా సంతోషకరమైన వార్తలు వింటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ విజయం సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిస్తేజమైన వ్యాపారాన్ని మెరుగుపరచడానికి చాలా శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. భార్య, పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన వార్తలతో సంతోషంగా ఉంటారు. గొప్ప మనుషుల సాయంతో శత్రువుల అంచనాను దెబ్బతీస్తారు. పాత విషయాలను మర్చిపోయి ముందుకు సాగుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ప్రభావం వల్ల సానుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారిక మీకు నూతన అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు సాధ్యమవుతున్నాయి. సాయంత్రం వేళలో శుభకరమైన కార్యాలు చేసే వీలుంది. మీరు సంతోషంగా ఉంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. మీరు ఒత్తిడిని తగ్గించడం ద్వారా అన్ని పనులు, వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉంటే మంచిది. ఈ సమయంలో పనిపై దృష్టి పెడితే అవసరం. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలుండే అవకాశముంది. వ్యవహార విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు మీకు కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా మీ జీవిత భాగస్వామి బాధపడుతుంది. ప్రయాణాలు చేసే అవకాశముంది. చంద్రుడు  మీకు ప్రయోజనం చేకురుస్తాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మీకు ఆదాయం పెరుగుతుంది. భూమి, రియల్ ఎస్టేటు పనుల నుంచి అనూహ్యమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం చేసేవారికి వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఉంటుంది. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు చేయకండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. యాదృచ్ఛికంగా మీరు ప్రయోజనాలు పొందే అవకాశముంది. నూతన ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు  మీకు ప్రత్యేకంగా ఉంటుంది. వారసత్వ ఆస్తి నుంచి ప్రయోజనం అందుకుంటారు. కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. కష్టమైన సమస్యను కూడా సులభంగా పూర్తి చేస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.