Asianet News TeluguAsianet News Telugu

today astrology: 25 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. 

today dinaphalithalu 25th august 2020
Author
Hyderabad, First Published Aug 25, 2020, 7:11 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 25th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. సోదరులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు చకాచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుంచి నూతన విషయాలు తెలుసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఇంటా బయటా కొంత అనుకూలంగా ఉండును. ఉద్యోగాల్లో ఎదురైన చిక్కులు కొంత వరకు తీరుతాయి. సన్నిహితుల నుంచి సహాయ సాకారాలు అందుతాయి. చేపట్టే పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుకుంటారు. నూతన విద్యలపై ఆసక్తి. శ్రమ అధికంగా ఉన్నా పనుల్లో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండును. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. పలు ప్రయత్నాలకు అనుకూలం.పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనలాభం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఉద్యోగాల్లో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సాకారాలు అందుతాయి. అరుదైన ఆహ్వానాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఉద్యోగాల్లో నూతనోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వస్తు కొనుగోలు ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టే పనులు, వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరగ్యం, వాహనాల విషయాల్లో మెలకువ అవసరం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు సంఘసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆప్తులను కలిసి ఉల్లాసంగా సమయం గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రగతి ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు, విలువ పెరుగుతుంది.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టే పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. బంధువులు, సన్నిహితులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. సానుకూల ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios