Asianet News TeluguAsianet News Telugu

today astrology: 23 ఆగస్టు 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో లోటుపాట్లు తప్పక పోవచ్చు. మీ కృషే మిమ్మల్ని నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. 

today dinaphalithalu 23rd august 2020
Author
Hyderabad, First Published Aug 23, 2020, 7:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 23rd august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలుగుతాయి. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తారు. గృహ సమస్యల నుంచి బయటపడతారు. స్నేహ ఒప్పందాలు బలపడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో లోటుపాట్లు తప్పక పోవచ్చు. మీ కృషే మిమ్మల్ని నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. వీలైనంతవరకు వివాదాలు, విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. నీలాప నిందలకు తావు లేకుండా ఉండటానికి ఈ సూచన చేయడం జరిగింది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. విపరీతమైన పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఆ కారణంగా ఓ మిత్రుడితో విరోధం రాకుండా ముందు జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయొచ్చు. ధైర్యంతో తీసుకున్న ఓ నిర్ణయం సరికొత్త మలుపుకు దారి తీస్తుంది. కనిపించని కృతజ్ఞత కోసం ఎదురు చూసి నిరాశ పడతారు. దైవదర్శనం చేసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఓ ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. తోటి వారి సలహాలు తప్పనిసరి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు మాట తొందరపాటు మిమ్మల్ని ఇబ్బందులను గురి చేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. సంస్థలో మీ సహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయి. మీ తెలివితేటలు నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఓ చక్కని అవకాశము మీ ముందుకు వస్తుంది. నేర్పుగా ఉపయోగించుకోండి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభ పడతారు. రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది. బంధు మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు తలపెట్టిన కార్యం జయం అవుతుంది. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఇతరులను మెప్పించి మీ పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వానానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి మీరు ప్రతిస్పందిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సాంకేతిక లోపాలు వల్ల మీ అందాల్సిన సమాచారం సకాలంలో మీకు చేరకపోవచ్చు. ముఖ్య విషయాల్లో ఆచితూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కార్యాలయంలో నూతనోత్సాహాన్ని శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు.  గోశాలలో గరిక దానం చేయండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు శుభవార్త వింటారు. చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అజీర్తి బాధించే అవకాశం ఉంటుంది. ఒకానొక ప్రయాణం మీకు అనుకూలంగా మారుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఒడుదొడుకులు తొలుగుతాయి. ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. చేపట్టే పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు పెరగకుండా చూసుకోండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios