Asianet News TeluguAsianet News Telugu

today astrology: 22 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి, అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాల్లో ధనాన్ని మదుపు చేస్తారు. 

today dinaphalithalu 22nd august 2020
Author
Hyderabad, First Published Aug 22, 2020, 7:11 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 22nd august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. అనుకూలమైన వాతావరణం నూతనోత్సాహాన్ని ఇస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధువులతో మేలు జరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి, అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాల్లో ధనాన్ని మదుపు చేస్తారు. స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి సహాయ సాకారాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  మనోధైర్యంతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు. కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు పరుస్తారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి. యోగాభ్యాసం ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. విలువైన వస్తువులు భద్రత పట్ల అప్రమత్తత వహించండి. వాహన యోగ సూచన ఉంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. ప్రజాసంబంధాలను బలపరచుకోవడానికి మరింత శ్రమిస్తారు. అనుకూల ఫలితాలను సాధిస్తారు. గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి. శుభపరంపరగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్య సూత్రాలు క్రమపద్ధతిలో అమలు పరచాలని నిర్ణయించుకుంటారు. వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ, విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల ద్వారా ధన, వస్తు లాభాలు పొందుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు శ్రమకు ఓర్చి కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సంతాన విద్యా విషయ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. శత్రువులతో జాగ్రత్త అవసరం. ప్రారంభించిన పనిలో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ముఖ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అన్ని విషయాల్లో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన.  ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గృహోపకరణ సామాగ్రిని సమకూర్చుకుంటారు. బంధువులు శ్రేయోభిలాషులతో ఇష్టాగోష్టి సాగిస్తారు. అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా కాలం గడుపుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios