Asianet News TeluguAsianet News Telugu

today astrology: 21 ఆగస్టు 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరచుకునే యత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనిస్తే ఇంటగెలుస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి

today dinaphalithalu 21st august 2020
Author
Hyderabad, First Published Aug 21, 2020, 7:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 21st august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఓ శుభవార్త మీలో మనోధైర్యాన్ని పెంచుతుంది. దీర్ఘకాలిక ఆశయాలను నేర్చుకోవడానికి కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సంభాషణలు సాగిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శతృవర్గం బలహీనత తెలుసుకుని నేర్పుగా వ్యవహరిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరచుకునే యత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనిస్తే ఇంటగెలుస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహపూరితంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు తలపెట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. కార్యాలయాల్లో అధికారుల మెప్పు పొందుతారు. నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా కనిపిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. పొదుపు పథకాల ముందడుగులో ఉంటాయి. తల్లిదండ్రుల ఇంట్లో పెద్దలకు కావాల్సిన అవసరాలు సకాలంలో తీర్చి మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు శత్రువులపై విజయం సాధిస్తారు. ఓ సంఘటన బాధ కలిగిస్తుంది. ఓర్పు సహనం అధికంగా కలిగి ఉంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు దీర్ఘకాలిక మిత్రత్వానికి దారి తీస్తాయి. శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు మానసిక ప్రశాంతత పొందుతారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ శ్రమ వృధా కాదు. నిపుణుల సలహాలు పాటించి లాభపడతారు. సంవృద్ధికరమైమ ఆర్థిక వనరులు సంతోషానికి కారణం అవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. మంచి మాటతీరుతో పది మంది మెప్పును పొందుతారు. పుస్తక పఠనం వల్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు బ్యాంకు లావాదేవీలు పరిశీలించుకుంటారు. సంతృప్తి పడతారు. హోదా పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సౌందర్య సాధకాల పట్ల ఆకర్షితులవుతారు. దూరప్రాంతాల్లోని మీ వారితో సంభాషణలు సాగిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు శ్రమకు అదృష్టం తోడవుతుంది. మొదలు పెట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. మంచి సమాచారం అందుకుంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఇంటర్వులలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీదే పై చేయిగా ఉంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన నిర్ణయాలు కలిసివస్తాయి. వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. షేర్లు భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. మిత్రబృందాలతో చర్చలు సాగిస్తారు. సమయం అనుకూలంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు సంఘంలో మీ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. గతంలో మీకు సానుకూల పడని వ్యవహారాలు నేడు సానుకూలపడతాయి. ఏ పని మొదలుపెట్టిన సులవుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios