Asianet News TeluguAsianet News Telugu

today astrology: 20 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు.

today dinaphalithalu 20 august 2020
Author
Hyderabad, First Published Aug 20, 2020, 7:14 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 20 august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు సోదరులను, మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఊహించని అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. వస్తులాభం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు  ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. శుభకాలం, మానసికంగా దృఢంగా ఉండాలి. అంతా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. చర్చాగోష్ఠుల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు, వస్త్ర వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మీ చిత్తశుద్దే మిమ్మల్ని రక్షిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మిత్రులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు, వస్త్రాలు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. 
పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు గ్రహబలం అనుకూలంగా లేదు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. బంధువులు, మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. స్వల్ప, ధన, వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో, వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలు అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. శుభకాలం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు బంధువులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తొలుగుతాయి. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios