today astrology: 19 ఆగస్టు 2020 బుధవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు జీవిత భాగస్వామితో కీలక విషయాలను చర్చిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రతావిషయమై జాగ్రత్తలు పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు బాధ్యతలను సమర్ధవతంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంటుంది. వాహన మరమ్మతులు చేస్తారు. విశాల హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును సాగిస్తారు. శుభకార్యలకై కొంత ప్రయత్నాలు కలిసి వస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామితో కీలక విషయాలను చర్చిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రతావిషయమై జాగ్రత్తలు పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లను సాగిస్తారు.ఓ వార్త ఆనందాన్నిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మిత్రుల సలహాలు సూచనలు పాటిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కీలక వ్యవహారాల్లో ఆచితూచి ముందడుగేయాలి. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన విషయమై శ్రద్ధను కనబరుస్తారు. కళాసాహిత్యరంగాల పట్ల మీకున్న మక్కువ మరింత పెరుగుతుంది.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు సెంటిమెంట్ విషయాలు కలిసి వస్తాయి. వాహనయోగ సూచన ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. సలహాలు మేలు చేస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. దారి తెన్నులేని వ్యవహారాలను ఒక గాడిలోకి పెట్టడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వినోద కార్యక్రమాలకు, విలాసాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు, ఖర్చులు ఆలోచింప జేస్తాయి. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు బంధువుల రాక ఆనందానికి కారణమవుతుంది. శుభఫలితాలు సొంతమవుతాయి. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. నూతన రంగంలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. ఉత్తర, ప్రత్యుత్తరాలను సాగిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. సలహాలు, సూచనలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. నిష్కారణంగా నిందారోపణలకు గురి చేస్తున్న వారిని గుర్తిస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లు నిజమని నమ్ముతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు ప్రతి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. స్వార్థ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోతారు. పార్ట్ టైం జాబ్ వర్క్ లను సంపాదించుకోగలుగుతారు. ఆశించిన రుణాలను అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. రచనా వ్యాసంగాలను సాగిస్తారు. గృహాలంకరణలకు ప్రాముఖ్యతనిస్తారు. ఉపయుక్తమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రజా సంబంధాలను మరింత వృద్ధి చేసుకుంటారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. శ్రేయోభిలాషులతో కలిసి చర్చలను సాగిస్తారు. ఆహార నియమాలను పాటించడం చెప్పదగిన సూచన. ప్రయాణాలు లాభిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటు దుడుకుతనం కలిగి ఉంటారు. రునభాదల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భాగుగా సాగుతుందని భావించిన వ్యవహారాల్లో ఇతరులకు జోక్యం కల్పించకండి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.