Asianet News TeluguAsianet News Telugu

today astrology: 18 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

today dinaphalithalu 18th august 2020
Author
Hyderabad, First Published Aug 18, 2020, 6:56 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 18th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఈ సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. తోటివారి సహకారం ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తీరుతాయి. వస్తులాభం పొందుతారు. అధికారుల సహాయంతో ఓ పని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. సోదరులతో ఏర్పడిన విభేదాలు తొలుగుతాయి. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పట్టుదల వదలకండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. బంధువులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయసాకారాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు వస్తాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి కనబరుస్తారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు బంధువులతో మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. మనోబలం తగ్గుకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వస్తులాభం పొందుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు  ధన, వస్తు లాభాలు పొందుతారు. విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఎదురైనా ఆటంకాలుు తొలుగుతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం ఉంది. అధికారుల సహాయం ఉంటుంది. ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. విందు, వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు శ్రమ పెరగుకుండా చూసుకోవాలి. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రుల సహాయ సాకారాలు అందుకుంటారు. ఆరోగ్యం వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios