Asianet News TeluguAsianet News Telugu

today astrology: 15 ఏప్రిల్ 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. దానధర్మాలు అధికంగా చేయడం మంచిది. అనవసర ఖర్చులు పెడతారు. అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందులు ఉంటాయి. అనుకూలత తక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
today dinaphalithalu 15th april 2020
Author
Hyderabad, First Published Apr 15, 2020, 7:15 AM IST

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులు పూర్తి చేయడంలో పట్టుదల అవసరం. పనులకు అనుగుణంగా ప్రణాళికలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.   సృజనాత్మకత తక్కువౌతుంది. పనులు పూర్తి అవుతాయి. కాని సంతృప్తి తక్కువ. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. దానధర్మాలు అధికంగా చేయడం మంచిది. అనవసర ఖర్చులు పెడతారు. అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందులు ఉంటాయి. అనుకూలత తక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. లాభాలు ఉన్నా సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఒత్తిడితో పనులు పూర్తిచేస్తారు. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. సంతృప్తిలోపం కనబడుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో తొందరపాటు పనికిరాదు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు అనుకూలిస్తాయి. అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. హోదా, అధికారంకోసం ఆరాట పడతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. అనుకున్న పనులు ఒత్తిడితో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విశ్రాంతి లోపిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సుఖం కోసం ఆరాటపడతారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ఒత్తిడులు అధికం అవుతాయి. పోటీల్లో గెలుపుకై ఆరాట పడతారు. అనవసర ఇబ్బందులు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లభిస్తాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న పనులు పూర్తి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమ్తతతో ఉండాలి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  శ్రమాధిక్యం. గుర్తింపుకై ఆరాట పడతారు. పనుల్లో ఒత్తిడి ఉంటుంది.  అధికారులతో అప్రమత్తత అవసరం. పోటీల్లో గెలుపు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాట పడతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.  

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిడిఅధికంగా ఉంటుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పనుల్లో లోపాలు కనబడతాయి.  సంతృప్తి లభించదు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో సౌకర్యాలు వెతుక్కుటాంరు. ఊహించనిఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులకై ఆరాటపడతారు. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతనోత్సాహం ఉంటుంది. పనుల్లో జాగ్రత్తలు. గౌరవం కోసం ఆరాటపడతారు. అన్ని విధాలా ఆదాయాలు. అధికారులతో అనుకూలత ఉంటుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. నిల్వధనం కోల్పోతారు. అనవసర ఖర్చులు చేస్తారు. పనుల్లో ఆటంకాలు వస్తాయి. విశ్రాంతి లోపిస్తుంది. విహారయాత్రలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.
 
    
Follow Us:
Download App:
  • android
  • ios