వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మీ స్వంత వ్యాపారంలో నష్టాలు చవిచూసే అవకాశముంది. వీలైనంతవరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది. మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయం తగినంత ఉండదు. అంతేకాకుండా మీరు స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో సహచరులకు విభేదాలు ఉండే అవకాశముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు కొంత మానసిక వ్యధ కలుగుతుంది. భూమి, ఆస్తికి సంబంధించి మీ ఇంట్లో కొత్త సమస్యలు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఇతర సందర్భాల్లో మీరు కలత చెందవచ్చు. సంతానం గురించి మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మీరనుకున్నదాని కంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎవ్వరికీ రుణాలు ఇవ్వకూడదు. తెలివితేటలు పట్టుదలతో మీరు పరిస్థితిని అనుకూలంగా చేయవచ్చు. అంతేకాకుండా ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఉద్యోగులకు సమస్యల తలెత్తే అవకాశముంది. వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఈ రోజు కొంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపారం గురించి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో మీ చేతుల్లోకి వచ్చే ఏ అవకాశాన్ని మీరు కోల్పోకూడదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉంటే మంచిది. కోర్టు విషయాల్లో ఈ రోజు మీరు తిరగాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందుల్లో మీరు చాలా అలిసిపోవచ్చు. మీరు ఎంచుకున్న రంగంలో అవరోధాలు ఎదురయ్యే అవకాశముంది. అంతేకాకుండా మీరు ఎన్నో సమస్యలతో తికమక అవుతారు. మీరు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు మీ వ్యాపారాన్ని అదేవిధంగా కొనసాగించడం మంచిది. మీ పనితీరుకు అందరి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పని లేదా ప్రారంభించిన వ్యవహారంలో విజయాన్ని అందుకుంటారు. అయితే మీరు వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరముంది. మీరు ఒకరి కోసం మంచి పని చేయవచ్చు. అయితే వారు మీ మాటలను అర్థం చేసుకోరు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. చాలా ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. మీరు ఇంట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో వివాదాలు గురించి చర్చ జరుగుతుంది. సొంతంగా దేని గురించైనా గొడవ ఉండవచ్చు. సామాజిక ప్రతిష్టను కొనసాగించడానికి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు కుటుంబంలో ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇస్తారు. మీరు పూర్తి చేయాల్సిన పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. మీరు తక్కువగా మాట్లాడటం పనితీరు ద్వారా అధికారుల ప్రశంసలు అందుకుంటారు. త్వరలో మంచి ఫలితాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు జీవితభాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది. వీలైనంత వరకు తగాదలకు దూరంగా ఉండటం మంచిది.  కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకుని ఉండాల్సి ఉంటుంది. ఖర్చుల కోసం డబ్బును ఇతరులను అడగకూడదు. మీ పనిపై నమ్మకం ఉంచడం ద్వారా సమస్యలను అధిగమిస్తారు. మీ పనిప్రదేశంలో ఈ రోజు కొన్ని మార్పులు గమనించవచ్చు. కాబట్టి ఏదైనా చేసేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కుటుంబంతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీపై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశముంది. అయితే మీ మాటలు ఇతరులు వింటారు. వృత్తి, వ్యాపారాలను ఇదే విధంగా కొనసాగించడం మంచిది. ఓ వైపు మీకు బాధ్యతలు పెరుగుతుంటాయి. మరో వైపు కొన్ని నూతన ప్రయోజనాలు అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు అంతా సానుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేయాలనే సంకల్పంతో మీరు దాన్ని పూర్తి చేస్తారు. మీకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మధ్యలో వదిలేసిన పనిని ఈ రోజు మీరు పూర్తి చేస్తారు. మీ పనితో ఇతరులను ఆకట్టుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మిమ్మల్ని మీరు సమర్థవంతంగా ఉంచడానికి మీరు కొంచెం ఆలోచించాలి. ఇతర నిత్యావసరాల కోసం ఖర్చు చేయాలి. చాలా కాలం తర్వాత మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆరోగ్యం బలహీనంగా కొంతవరకు ఉంటుంది. మీ పనిప్రదేశంలో మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా మీ పనిలో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.