Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 10 మే 2021 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉత్సాహం. 

today dinaphalithalu 10th may 2021
Author
Hyderabad, First Published May 10, 2021, 7:07 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 10th may 2021

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలలో జాప్యం. రావలసిన బాకీలు అందవు. ఆస్తి విషయాల్లో వివాదాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు నూతన పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు  రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో  విభేదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులే సమస్యలు సృష్టి్టస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. బంధువుల ద్వారా శుభవార్తలు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కొన్ని బాకీలు అందుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు. దేవాలయ దర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. భూవివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో పనిభారం. దైవదర్శనాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. ఆదాయం పెరుగుతుంది. ధార్మిక చింతన.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ, వాహనయోగాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు  కుటుంబసభ్యులతో వైరం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఆందోళన. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios