Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 05 మార్చి 2021 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి  ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. 

today dinaphalithalu 05th march 2021
Author
Hyderabad, First Published Mar 5, 2021, 7:12 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 05th march 2021

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుల. వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు పనుల్లో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు.  ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఖర్చులు అధికం. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీలలో పురోగతి.. పనులు చకచకా పూర్తి చేస్తారు. వస్తులాభాలు.  చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు  కొత్త పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో మరింత సఖ్యత. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  దైవదర్శనాలు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  అదనపు ఖర్చులు. బంధువులతో విభేదాలు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios