డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : లాభాలు సద్వినియోగం అవుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. పనులలో ఒత్తిడి తగ్గుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆనందంగా కాలం గడుపుకుంటారు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఉద్యోగస్తులకు పనులలో కొంత ఒత్తిడి తీవ్రత తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ప్రయాణాలు ఆచి, తూచి వ్యవహరించాలి. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. అనుకున్న గౌరవం లభించకపోతే మనసు నొచ్చుకుంటుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విద్యార్థులకు అనుకూలమైన సమయం. పరిశోధనలపై అధిక శ్రద్ధ పెడతారు. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. పనులు వాయిదావేసుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తంపైన కొంత అసంతృప్తి అధికంగానే ఉంటుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు. పరామర్శలకు అవకాశం ఉంటుంది. వైద్యశాలల సందర్శనం చేసే సూచనలు ఉన్నాయి. శ్రమలేని సంపాదనపై ఆలోచన వెళుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు పనులు చేయకూడదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి కనపడుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగవచ్చు. భాగస్వామ్య అనుబంధాల విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పోటీల్లో గెలుపుకై ఆశిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పనులలో కొంత నెమ్మదితనం వస్తుంది. తమ అంతఃశత్రువులపై విజయం సాధించే ప్రయత్నం మొదలుపెడతారు. నిరంతర జప సాధన ఉపయోగపడుతుంది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : క్రియేటివిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో పట్టుదల అధికం అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సంతోషంకోసం వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. గృహనిర్మాణ పనులు కొంత ఆలస్యం అవుతాయి. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. రచయితలకు అనుకూలమైన సమయం. విద్యార్థులు విద్యనభ్యసించే ప్రయత్నం చేస్తారు. సాదారణ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు ఒకరికొకరు సహాయం చేసుకునే సమయం. రచనలపై ఆసక్తిని పెంచుకుంటారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వాగ్దానాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. మధ్యవర్తి వ్యవహారాలు పనికిరావు. కుటుంబంలో గౌరవం, అనుకూలత పెంచుకుంటారు.  నిల్వధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలపై ఆలోచన వెళుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శారీరశ్రమ అధికం అవుతుంది. శ్రమకు తగినట్టుగా పనులు చేయలేరు. తొందర అలసి పోతారు. తమ పనులకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికై అధిక ప్రయత్నం ఉంటుంది. పాదాల నొప్పులు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార విషయల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలపై ఆలోచన వెళుతుంది. నిరంతర జపం చేస్తూ ఉండడం మంచిది.

దిన ఫలితాలు 5.4.2020