డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

నవంబరు 14న మీనం రాశిలో కుజ గ్రహం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు వక్రత్యాగం చేయనుంది. ఈ కుజ గ్రహ కదలిక వలన ద్వాదశ  రాశి చక్రంపై ప్రభావం పడనున్నది. కొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉండగా.. మరికొన్నింటిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఐదు రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ దీపావళిలో గ్రహాల స్థితిలో చాలా మార్పులు ఉన్నాయి. నవంబరు మాసంలో చాలా గ్రహాల స్థానం మారబోతుంది. ఇదే క్రమంలో దీపావళి రోజు ఉగ్రమైన గ్రహంగా భావించే కుజుడి స్థితిలో మార్పు సంభవించనుంది. 

​మీనరాశి జలతత్వానికి సంకేతం. ఈ రాశికి అధిపతి గురువు. కుజుడు, గురువు మిత్రుత్వంతో ఉంటారు. ఫలితంగా కుజుడి ప్రయాణం వలన ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వృత్తిలోనూ మంచి పురోగతి ఉంటుందని పరిగణిస్తారు. ఫలితంగా కుజుడి ప్రయాణం వలన ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఐదు రాశులపై సానుకూల ప్రభావం ఉంటుంది, ఆ ఐదు రాశుల వివరాలు ఇప్పుడు గమనిద్దాం.

​వృషభరాశి వారికి :- అనుకూలంగా ఉంటుంది. ప్రయోజనాలు పొందుతారు. గౌరవాలు, అవార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ సమయంలో నిరీక్షణను పూర్తి చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుడపడటంతోపాటు వారి వృత్తిని కూడా వేగవంతం చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చిన ఈ మార్పు నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. శుక్రవారం రోజు పేదవారికి వారికి తెలుపు రంగు వస్తువులను దానం చేస్తే ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు.

​కర్కాటకరాశి వారికి :- శుభకరంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. ఉన్నత విద్య గురించి ఆలోచిస్తుంటే కుజ గ్రహం ఈ మార్పు వల్ల సమస్యాత్మకంగా ఉంటుంది. అయితే సంతానం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. మీనరాశిలో కుజుడి ప్రయాణం వల్ల కలిగే ప్రభావం నుంచి నూతన శక్తిని పొందుతారు.

​తులారాశి వారికి :-  ఈ సమయంలో మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు.  మీ పోరాట సామర్థ్యం మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో ఆగిపోయిన పనులు, వ్యవహారాలు పూర్తిచేసేందుకు ఇది సరైన సమయం. మీ కార్యచరణ ప్రణాళికలు ఈ సారి విజయవంతమవుతాయి. కష్టపడి పనిచేస్తే ఈ సమయలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంపై ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

​ధనస్సురాశి వారికి :- సానుకూలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఆస్తిని కొనడం లేదా అమ్మడం గురించి ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు విజయం సాధించవచ్చు. మార్కెటింగ్ రంగంలో పాలుపంచుకుంటే ఈ సమయంలో లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. పెద్ద ఒప్పందం మీకు ఫైనల్ కావచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో మీ భాగస్వామితో ఈ సమయంలో భేదాభిప్రాయాలు ఉండే అవకాశముంది. మీరు కోరుకున్న ఫలితాలను పొందవచ్చు.

​మకరరాశి వారికి :- శుభకరంగా ఉంటుంది. ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపుతుంది. శక్తి పెరుగుతుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం ఈ సమయంలో దూరమవుతుంది. కుజుడి ప్రత్యేక స్థానం మిమ్మల్ని ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. ప్రయత్నాలు పూర్తి చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా నమ్మకంగా మారవచ్చు. కోరికలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకే సమయంలో చాలా పనులు చేయవచ్చు.