జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిదేవుడు.. మన మంచి, చెడు పనుల ఫలితాలనిస్తాడు. సాధారణంగా శని అస్తమించినప్పుడు కొన్ని రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో శని అస్తమిస్తాడు. కాబట్టి ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. 

శని.. ఫిబ్రవరి 28న అస్తమించి, ఏప్రిల్ 6వ తేదీన ఉదయిస్తాడు. దాదాపు నెల రోజులకు పైగా శని అస్తమయం కొనసాగుతుంది. అయితే ఈ టైంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

కర్కాటక రాశి:
ఈ రాశి వారు డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నప్పుడు జాగ్రత్త పాటించాలి. విద్యార్థులు కష్టపడి చదవాలి. వివాహ జీవితంలో సమతుల్యత పాటించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

సింహ రాశి:
ఈ రాశి వారికి శని అహంకారాన్ని పెంచుతాడు. కొత్త సమస్యలు రావచ్చు. కుట్రలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. డబ్బు విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి:
ఈ రాశి వారు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మహిళల బడ్జెట్ పై ప్రభావం ఉంటుంది.

శని దోష నివారణకు శని మంత్రం జపించండి. అవసరంలో ఉన్నవారికి నల్ల నువ్వులు, ఉలవలు, నల్ల వస్త్రాలు దానం చేయండి. శనివారం నాడు శని దేవుడిని పూజించండి.