డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

రాహువు-కేతువులు సెప్టెంబరు 23న రాశి పరివర్తనను చేసుకోనుండగా.. అంతకంటే ఒక రోజు ముందే 22వ తేదీన బుధుడు కన్య నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఫలితంగా ఈ ఐదు రాశులవారికి సానుకూల ఫలితాలుంటాయి. ముఖ్య గ్రహల స్థాన చలనం వలన వ్యక్తుల యొక్క వ్యక్తిగత జాతక ఆధారంగా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చును. జ్యోతిషశాస్త్ర  ప్రకారం గ్రహ కదలిక వలన కొన్ని రాశులకు సానుకూల ఫలితం ఉంటే.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావముంటుంది అంటూ ఉంటుంది. 

ఈ క్రమంలో 23 సెప్టెంబరు బుధవారం రోజు రాహు, కేతువులు తమ రాశి పరివర్తనను చేసుకోబోతున్నాయి. ఇదే సమయంలో ఒక రోజు ముందే సెప్టెంబరు 22 మంగళవారం రోజు  బుధుడు.. కన్యారాశి నుండి తన స్థానాన్ని మార్చుకొని తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రయాణంలో బుధుడు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా కలిసి వస్తుంది. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నవారికి వారు చేపట్టిన పని సునాయాసంగా పూర్తిచేయగలుగుతారు, కాలం కలిసివచ్చినట్టు గోచరిస్తుంది. 

బుధగ్రహ అనుకూలత వలన జాతకులకు పాండిత్యం, మంచిమాటకారి తనం ( వాక్చాతుర్యం ),  యజ్ఞక్రతువులు, బంధుత్వాలు, మేన కోడలు,మేన అల్లుడితో బంధం, వట, పిత్త, శ్లేషం అనుకూలంగా ఉంచడం. సంపద, హాస్యం, పండితులచే సత్ సంబంధాలు, సభా సమావేశాలు, ఆట స్థలములందు, గణితం నందు ప్రావీణ్యత, వ్యాపారం, ఉద్యోగ కారక గ్రహంగా పరిగణిస్తారు. మరి బుధుడు మార్పు వల్ల ఏయే రాశులకు శుభంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

​వృషభరాశి వారికి :- బుధుడి సంచారం ఫలితంగా ఈ రాశివారికి శుభకరమైన ఫలితాలు పొందనున్నారు. ఈ సమయంలో పిల్లల పురోగతితో మనస్సు సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో గతంలో ఏర్పడిన దూరాలు తొలగిపోతాయి. మీరు మీ పని, తెలివితేటలను కార్యక్షేత్రంలో ప్రత్యేక స్థితిని కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశముంది. విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటారు. బంధుత్వాలు నిలబెట్టుకోవాలి. కొన్ని కుటుంబం లోని అదనపు భాద్యతలు పెరుగుతాయి.  

​మిథునరాశి వారికి :- రాహువు, కేతువుల కంటే ముందే బుధుడు మిథున రాశిలోని ఐదవ పాదంలో సంచారం చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. వైవాహిక జీవితంలో శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.స్నేహితులను, సన్నిహితులను కలుసుకుంటారు. ఏ పని ప్రారంభించిన ఇష్టంగా పూర్వకంగా చేయడానికి  కృషి చేస్తారు. అందరి దృష్టిలో మీ గురించి సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఆర్ధిక రుణాలను తీర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు శుభఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. 

​కన్యారాశి వారికి :- బుధుడు కన్యారాశి నుండి మార్పు చెందనున్న కారణంగా వీరికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సంబంధిత సమస్యలు అంతమవుతాయి. యువత ప్రేమ వ్యహరంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. సమయం వృధా చేయడం వల్ల మీకు నష్టం కలుగుతుంది. తోబుట్టువులతో మీ సంబంధాలు బలపడతాయి. ఈ సమయంలో మీ జీవితంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. తల్లి నుండి ఆనందాన్ని పొందుతారు. తండ్రి మార్గదర్శకత్వంలో సూచనలతో వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. 

​ధనస్సురాశి వారికి :- రాహువు-కేతువుల కంటే ముందు బుధుడు ప్రవేశం చేయడం వలన ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో వారికి ఆదాయం పెరుగుతుంది. బుధుడి మార్పు వల్ల జీవిత భాగస్వామి, ఎంచుకున్న రంగంలో పురోగతి ఉంటుంది. కొత్త  విషయాలు నేర్చుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. పై అధికారి జోక్యంతో అసంపూర్ణ పథకాలు పూర్తవుతాయి. అంతేకాకుండా ప్రయోజనం పొందుతారు.

​మకరరాశి వారికి :- బుధుడి స్థాన మార్పు వలన ఈ కాలంలో కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందడానికి ధార్మిక ప్రదేశాలకు వెళ్తారు. మీ జీవితాన్ని మెరుగుపర్చడానికి ఎన్నో అవకాశాలు పొందుతారు. విద్యారంగంలో విద్యార్థులకు కొత్త విజయాలు లభిస్తాయి.  మనస్సు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిమగ్నమై ఉంటుంది. నిరుద్యోగులకు భాద్యతలు పెరుగుతాయి. 

బుధగ్రహ ప్రతికూలతల వలన బంధువైరం, నరాల బలహీనత, మెదడుకు సంబంధించిన ఆనారోగ్యాలు, గొంతు వ్యాధులు, చర్మ వ్యాధులు మొదలగునవి ఎవరి జాతకంలో బుధుడు ప్రతికూలంగా ఉంటే పై తెలిపిన ఇబ్బందులు కలుగుతాయి. ద్వాదశ రాశుల వారు మీ వ్యక్తీ గత జాతక గ్రహస్థితి ఆధారంగా నివారోపాయలు పాటిస్తే సత్ఫలితాలు కలుగుతాయి.

రేమిడిస్ :-బుధ గ్రహం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు పచ్చ పెసర్లు నానబెట్టి అందులో బెల్లం కలిపి ఆవుకు దానగా తినిపించాలి.పేదవారికి ఆకుపచ్చ రంగు కలిగిన వస్త్రాలను దానం చేయాలి. ఆకు పచ్చ రంగు కలిగిన కూరగాయలు, పండ్లు, ఆవునెయ్యి పేద వారికి ఇష్ట పూర్వకంగా దానం చేయాలి. విష్ణు సహస్ర నామలు చదువుకోవాలి. గణపతికి గరికతో పూజ చేయండి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజచేయండి శుభం కలుగుతుంది.