వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ అనుకున్నది పూర్తి చేస్తారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఎంచుకున్న రంగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. మీరు ఒక  చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశముంది. మీపై అధికారులతో గొడవ పడే అవకాశముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది. మీకు కొంచెం సవాలుతో కూడికొని ఉంటుంది. ఏ కారణం లేకుండానే వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంది. ఇతరులతో అనవసరంగా మాట్లాడకండి. సోదరీసోదరమణుల సలహా తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాతావరణం కారణంగా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశముంది. పూర్తి కాని పనులు, వ్యవహారాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే కొంత మంది మొండిగా ముందుకు వెళ్తారు. ఊహాగానాల కారణంగా మీరు లక్ష్యం నుంచి బయటపడే అవకాశముంది. ఈ విషయాల నుంచి మనస్సును దూరంగా ఉంచి పనులు పూర్తి చేసుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మీ వాక్చాతుర్యంతో వ్యాపారంలో మీరు ప్రయోజనం అందుకుంటారు. మీరు ఇతరులకు సాయం చేస్తారు. పని ప్రదేశంలో సమస్యలు ఎదురైనప్పటికీ పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో పెద్ద నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. ఆస్తి విషయంలో ఖరారు చేయకపోవడం సరైందే. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కీలకమైన పని, లేదా వ్యవహారాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీపై అధికారుల పట్ల ఉదారంగా ఉంటారు. వారి తప్పులను క్షమించేందుకు సిద్ధంగా ఉంటారు. దీని ప్రయోజనం తర్వాత చూస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఈ సమయంలో మీపై అధికారి పట్ల మీ వైఖరి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. మీ నడవడికతో అందరి హృదయాన్ని గెలుచుకోవాలి. మీరు మీ గురించి మరింత ఆలోచించుకోవాలి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వారి బాధను మీరు పంచుకుంటారు. కుటుంబంలో అందరితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీరు ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆర్థిక విషయాల్లో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. అంతేకాకుండా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. పనిలో మీరు మీ సొంత ప్రతిభతో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందుకు సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులో పనిచేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మంచి మనస్సుతో నిర్ణయం తీసుకుంటే మంచే జరుగుతుంది. వ్యాపారంలో మీ వాక్చాతుర్యంతో ప్రయోజనం పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో ఏదైనా పనిని పూర్తి చేస్తారు. మీకు హృదయాన్ని హత్తుకునే లేదా భావోద్వేగపు పరిస్థితులు తారసపడతాయి. మీ కరుణ, ఉదారతతో ఇతరుల మనస్సును గెల్చుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు కీలక పని ద్వారా లాభాన్ని పొందుతారు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. సాయంత్రం శుభకార్యాల్లో పాల్గొంటారు. దూరంగా ఉన్న బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. వసూలు కాని రుణం వసూలవుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మీ పనిలో మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో సొంత అవగాహన ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమైన పనిని పూర్తి చేయడం మంచిది. మీకు మానసిక ప్రశాంతత కొరవడుతుంది. మీకిష్టమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు మీరు ఎంచుకున్న రంగంలో పురొగతి ఉంటుంది. గౌరవ మర్యాదలతో పాటు కీర్తిని పొందగలుగుతారు. ఆగిపోయిన పనిని పూర్తి చేయగలుగుతారు. మీ మనస్సు కూడా సంతోషకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోజనాలు అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు. నూతన పని పూర్తయిన ఆనందంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీకు ప్రతికూల ఫలితాలుంటాయి. ఏదో ఆలోచిస్తూ ఉండటం వల్ల మనస్సు కలత చెందుతుంది. కుటుంబంలో మనస్పర్థలు ఉంటాయి. దూరంగా ఉన్న స్నేహితులను కలుస్తారు. వారితో మాట్లాడటం వల్ల మనస్సు తేలిక పడుతుంది. సంతానం గురించి ప్రత్యేకమైన ఆలోచనలు చేస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.