ఏపీ ఎన్నికలు: ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్, దాడుల్లో ఇద్దరు మృతి

ap assembly, lok sabha polls live updates, polling

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు, ఘర్షణలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రత్యర్థుల దాడుల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒకరు, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మరొకరు మరణించారు.

6:01 PM IST

ముగిసిన పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు, ఘర్షణలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ఎండ వేడిమి తగ్గడంతో పాటు ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో 6 గంటలకు కూడా బూత్‌లు కిక్కిరిసిపోయాయి.

ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైంది.

5:56 PM IST

5 గంటల వరకు పోలింగ్ శాతం

సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

5:51 PM IST

ఖాళీ అయిన సిరా.. నిలిచిపోయిన పోలింగ్

తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. వేలుకు మార్క్ వేసే సిరా అయిపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. అప్పటికే భారీగా ఓటర్లు బారులు తీరడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. 

5:47 PM IST

తంబళ్లపల్లెలో వైసీపీ కార్యకర్త దారుణహత్య

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ స్వగ్రామంలో వైసీపీ కార్యకర్త టీ. సాదమ్‌ను టీడీపీ నేతలు హత్య చేశారు. 

5:29 PM IST

అమలాపురంలో పోలీసులపై జనసేన కార్యకర్తల దాడి

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఉద్రిక్త వాతవరణం చోటు చేసుకుంది. జనుపల్లిలో జనసేన కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. 
 
5:24 PM IST

తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో జేసీ వీరంగం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరంగం సృష్టించారు. తన అనుచరులను అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ లోపల బైఠాయించి జేసీ ఆందోళన నిర్వహించారు.  

5:09 PM IST

చిలకలూరిపేటలో టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ కథనాలు వెలువడుతుండటంతో కలకలం రేగింది. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి పోలింగ్ బూత్ వద్ద వీడియో దృశ్యాలను ఆ పార్టీ బయటపట్టింది. 
 
5:00 PM IST

వైసీపీకి మద్ధతు.. ఏపీవోను విధుల్లోంచి తప్పించిన అధికారులు

కర్నూలు జిల్లా బనగానపల్లె సంజామల ఏపీవో కళావతిని అధికారులు ఎన్నికల విధుల నుంచి తప్పించారు. బూత్ నెంబర్ 232లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ ఆమెపై ఫిర్యాదు రావటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. 

4:57 PM IST

పిఠాపురం టీడీపీ అభ్యర్థి వర్మపై దాడి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది. 

4:53 PM IST

తిరిగొస్తున్న ఓటర్లు... పోలింగ్ కేంద్రాల్లో పెరుగుతున్న రద్దీ

ఎండలు వేడిమి తగ్గడంతో పాటు వాతావరణం చల్లబడటంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెరుగుతున్నారు. ఉదయం ఈవీఎంలు పనిచేయకపోవడంతో విసిగిపోయి ఇళ్లకు వెళ్లినవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తిరిగి పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. 
 
4:50 PM IST

క్యూలైన్‌లో 700 మంది ఓటర్లు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం మండలం సవిరవిల్లిలోని పోలింగ్ బూత్‌లోని క్యూలో సుమారు 700 మంది ఓటర్లు బారులు తీరి ఉన్నారు. 

4:43 PM IST

కడపలో భారీ వర్షం, పోలింగ్‌కు ఆటంకం

కడప జిల్లా పాములపాడు మండలం ఎర్రగడూరులో భారీ వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్తుగా విద్యుత్ శాఖ కరెంట్ సరఫరా నిలిపివేసింది. దీంతో అధికారులు సెల్‌ఫోన్ వెలుతురులో ఓటింగ్‌ను కొనసాగిస్తున్నారు. 
 
4:40 PM IST

జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్: కడప ఎస్పీ

చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు కడప జిల్లా ఎస్పీ అవినాష్ మహంతి. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగలేదన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
 
4:37 PM IST

టీడీపీపై ప్రశాంత్ కిశోర్ ఫైర్

తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫైరయ్యారు. తన పేరుతో ఓ నకిలీ ట్వీట్‌ను టీడీపీ ప్రచారం చేస్తోందని...ఓటమి కళ్ల ముందున్నప్పుడే ఇలాంటి దిగజారిన చర్యలకు పాల్పడతారని ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు. నకిలీ వార్తలను టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 

4:31 PM IST

ఓటు వేయని వారు వెనక్కి వచ్చి ఓటు వేయండి: చంద్రబాబు

ఉదయం ఈవీఎంలు పనిచేయక ఓటు వేయని వారు తిరిగి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌ను చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ప్రజలంతా స్వేచ్ఛంగా, నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాలని కోరారు. ఓటింగ్‌ను అడ్డుకోవాలని వైసీపీ చేస్తున్న కుట్రలను విఫలం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 
 
4:25 PM IST

ఆళ్లగడ్డలో మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: వైసీపీ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఓడిపోతామనే భయంతోనే భూమా కుటుంబం తమపై ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేసింది.

తాము కిడ్నాప్ చేసినట్లు ఆధారాలుంటే చూపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కిడ్నాప్ జరిగితే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. అహోబిలంలో మాపై దాడి చేసింది భూమా అనుచరులేనని వైసీపీ స్పష్టం చేసింది. 
 
4:17 PM IST

ఇనిమిట్లలో కోడెల డ్రామా: అంబటి

ఇనిమిట్ల ఘటన స్పీకర్ కోడెల డ్రామా అన్నారు సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు. ఓటమి భయంతో టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని, కోడెల పోలింగ్ బూత్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నారని రాంబాబు ఆరోపించారు.

రెండు గంటల పాటు బూత్‌లో తలుపులేసి కూర్చోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారని అంబటి మండిపడ్డారు. పోలింగ్ నిలిచిపోవడానికి కోడెలే కారణమని, ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని రాంబాబు స్పష్టం చేశారు. 

4:08 PM IST

బద్వేల్‌లో ఈవీఎం సామాగ్రి ధ్వంసం

కడప జిల్లా బద్వేల్‌లో టీడీపీ నేత ఒకరు హల్ చల్ చేశారు. పట్టణంలోని చెన్నంపల్లెలోని పోలింగ్ బూత్ నెం 176లోకి ప్రవేశించిన అతను ఈవీఎం సామాగ్రిని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. 

4:03 PM IST

3.30 గంటల వరకు పోలింగ్ శాతం

మధ్యాహ్నం 3.30 గంటల వరకు నమోదైన పోలింగ్ ఈ విధంగా ఉంది.

శ్రీకాకుళం 54%
విజయనగరం 63%
విశాఖపట్నం 51%
తూర్పుగోదావరి 52%
పశ్చిమగోదావరి 50 %
కృష్ణా 51 %,
గుంటూరు  50 %
ప్రకాశం   58 %
నెల్లూరు  53 %
చిత్తూరు  57 %
కర్నూలు 40 %
కడప   63  %
అనంతపురం 53%,

4:01 PM IST

విశాఖలో వర్షం, పోలింగ్‌కు ఆటంకం

విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఓటర్లు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. 

4:00 PM IST

పూతలపట్టు వైసీపీ అభ్యర్థిపై దాడి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో కట్టకిందపల్లెలో వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో బాబుతో పాటు అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాబు కారు ధ్వంసమైంది. 

3:55 PM IST

కర్నూలు జిల్లా మల్లేపల్లిలో ఘర్షణ

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల మధ్య వివాదం తలెత్తడంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

3:41 PM IST

వైసీపీ అభ్యర్ధిపై దాడి, గురజాలలో హైటెన్షన్

గుంటూరు జిల్లా గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై దాడి చేయడంతో పట్టణంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మాచవరం మండలం కొత్తగణేషునిపాలెంలో దళితులను ఓటింగ్ వెళ్లనీయడం లేదంటూ సమాచారం అందడంతో మహేశ్ అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

3:38 PM IST

3 గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదు: ద్వివేది

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెల్లడించారు. పోలింగ్ సరళి ఇలాగే ఉంటే సాయంత్రానికి 80 శాతం దాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పోలింగ్ గడువును పెంచాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ద్వివేది తెలిపారు. 
 
3:12 PM IST

నర్సారావుపేటలో రెస్టారెంట్‌పై వైసీపీ కార్యకర్తల దాడి

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఓ రెస్టారెంట్‌పై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో రెస్టారెంట్ అద్దాలు, ఫర్నిచర్, పలుకార్లు ధ్వంసమయ్యాయి. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా ఆందోళనకారులు దాడికి యత్నించారు. 

2:55 PM IST

దాడులకు పాల్పడిన వారిపై కేసులు: ద్వివేది

రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందున్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలు జరిగాయని దానితో పాటు మరో 20 చోట్ల ఘర్షణలు జరిగాయని వివరించారు.

ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ఘర్షణలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు. 381 ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని.. వాటిని మరమ్మత్తు చేయించామని వెల్లడించారు. 

2:48 PM IST

కడపలో ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్‌పై వైసీపీ దాడి

కడప జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఖాజీపేట మండలం మిడ్తూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ సుబ్బారెడ్డి కారుపై వారు రాళ్లు విసిరారు. 

2:43 PM IST

వీరాపురంలో పరిస్థితిని సమీక్షిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు వేట కోడవళ్లతో దాడులు చేసుకోవడంతో టీడీపీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి చనిపోయారు.

విషయం తెలుసుకున్న టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరాపురం గ్రామానికి చేరుకున్నారు. మరోవైపు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. 
 
2:39 PM IST

వైసీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని అక్కడికి వెళ్లా: కోడెల

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనమెట్లలో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారంతోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు.

పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే తనపై వైసీపీ నేతలు దాడి చేశారని.. పోలింగ్ అధికారులు తలుపులు వేస్తే వాటిని పగులగొట్టారన్నారు. వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తారని ముందే ఊహించామని చెప్పారు. మూడున్నర దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఈ విధంగా దాడులు చేయడం మొదటిసారిగా చూస్తున్నానని స్పీకర్ వ్యాఖ్యానించారు. 

2:25 PM IST

క్రమంగా పెరుగుతున్న పోలింగ్

ఈవీఎంలను ఎన్నికల సంఘం మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఊపందుకుంది. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. 
 
2:20 PM IST

ఈసీ డౌన్ డౌన్ అంటూ మహిళల నిరసన

ఈవీఎంలు మొరాయించడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఎన్నికల కమిషన్‌పై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ మొగల్రాజపురం జమ్మి చెట్టు వద్ద మహిళలు ఆందోళన చేశారు. ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

2:17 PM IST

విజయవాడ మొగల్రాజపురంలో 2 గంటలకు ప్రారంభమైన పోలింగ్

విజయవాడ మొగల్రాజపురంలోని శ్రామిక విద్యాపీఠం 4వ బూత్‌లో ఉదయం నుంచి ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో మధ్యాహ్నం 1.45 గంటలకు అధికారులు పోలింగ్‌ను ప్రారంభించారు. అయితే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. 
 
1:24 PM IST

చీరాలలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ

ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చీరాల మండలం పిట్టువారిపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చేసుకుంది. ఈ ఘటనలో ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకరాయితో దాడి చేశారు. 
 
1:19 PM IST

బీజేపీ, టీఆర్ఎస్ మద్ధతుతో వైసీపీ రెచ్చిపోతోంది: చంద్రబాబు

బీజేపీ, టీఆర్ఎస్ మద్ధతుతో వైఎస్సార్ కాంగ్రెస్ రెచ్చిపోతోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఓటమి భయంతోనే వైసీపీ హత్యలు, హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. 

1:12 PM IST

మధ్యాహ్నం 12.30 వరకు పోలింగ్ శాతం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

శ్రీకాకుళం  : 30 శాతం

విజయనగరం  :  35 శాతం

విశాఖ  :   33 శాతం

పశ్చిమగోదావరి ; 32 శాతం

తూర్పు గోదావరి : 32 శాతం

విజయవాడ : 33 శాతం

గుంటూరు  : 32 శాతం

ప్రకాశం : 33 శాతం

నెల్లూరు : 32 శాతం

కర్నూలు : 32 శాతం

చిత్తూరు :  31 శాతం

కడప :  30 శాతం

అనంతపురం : 30 శాతం

1:00 PM IST

మధ్యాహ్నం 11 గంటలకు 30 శాతం పోలింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యాహ్నం 11 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. 

శ్రీకాకుళం: 19.78%
విజయనగరం: 31.57%
విశాఖపట్నం: 21.64%
తూర్పుగోదావరి: 27.50%
పశ్చిమగోదావరి: 20.41%
కృష్ణా: 24.10%
గుంటూరు: 24%
ప్రకాశం: 22%
నెల్లూరు: 23.32%
చిత్తూరు: 25.18%
కడప: 17.84%
కర్నూలు: 23%
అనంతపురం: 21.47%

12:55 PM IST

ద్వివేదిని కలిసిన వైసీపీ నేతలు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ  ద్వివేదిని వైసీపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో పోలింగ్ సరళి, ఈవీఎంల పనితీరుపై టీడీపీ అనుకూల మీడియాలో దుష్ప్రాచారాన్ని వారు సీఈవో దృష్టికి తీసుకొచ్చారు.

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలకే రీ పోలింగ్ అంటున్నారని వారు విమర్శించారు. ద్వివేదిని కలిసిన వారిలో వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి ఉన్నారు.

12:53 PM IST

రాయచోటీలో ఇంకా గాడిలోకి రాని ఈవీఎంలు

కడప జిల్లా రాయచోటిలో ఇప్పటికీ ఈవీఎంలు గాడిన పడలేదు. నియోజకవర్గంలోని 45వ పోలింగ్ స్టేషన్‌లో పార్లమెంట్‌‌కు సంబంధించిన ఈవీఎం ఇప్పటి వరకు పనిచేయలేదు. ఇప్పటికీ రెండు సార్లు ఈవీఎంలను మార్చినప్పటికీ అదే పరిస్ధితి కొనసాగుతోంది.

12:37 PM IST

ఈసీ పనితీరుపై పవన్ అసంతృప్తి

ఎన్నికల సంఘం పనితీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయిందని పవన్ మండిపడ్డారు. ఈసీ కట్టుదిట్టంగా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేనాని ఆరోపించారు.

12:34 PM IST

వైసీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటు చేసుకుంది. వీరాపురంలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు వేట కొడవళ్లలో పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కరరెడ్డి మరణించగా, వైసీపీకి చెందిన పుల్లారెడ్డి అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, భారీగా మోహరించారు.

12:14 PM IST

ఓటు వేయడానికి వచ్చి కుప్పకూలిన వృద్ధుడు

పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని 15వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి వచ్చిన బండారు ముసలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

12:08 AM IST

పోలింగ్ కేంద్రంలో చొక్కా విప్పి హల్‌చల్ చేసిన కోడెల

రాజుపాలెంట మండలం ఇనిమెట్లలో స్పీకర్ కోడెల శివప్రసాద్ హల్‌చల్ చేశారు. ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి కోడెల తలుపులు వేశారు. 20 నిముషాల పాటు ఆయన చొక్కా విప్పి పోలింగ్ బూత్‌లోనే బైఠాయించారు.

దీంతో పోలీసులు కోడెలను బలవంతంగా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో స్పీకర్ సొమ్మసిల్లి పడిపోయారు. 

11:58 AM IST

కడప జిల్లా గుండాలపల్లెలో 12 కావొస్తున్నా ప్రారంభం కానీ పోలింగ్

కడప జిల్లా గుండాలపల్లెలో మధ్యాహ్నం 12 గంటలు కావొస్తున్నా ఇప్పటికీ పోలింగ్ ప్రారంభం కాలేదు. వీవీ ప్యాట్ మొరాయించడంతో అధికారులు పోలింగ్‌ను ప్రారంభించలేదు.

11:55 AM IST

బెజవాడ తూర్పులో వింత పరిస్ధితి

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈవీఎంల పనితీరు గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు పడి.... ఎంపీ అభ్యర్థికి ఓట్లు పడకపోవడాన్ని ప్రజలు అధికారుల దృష్టికి  తీసుకొచ్చారు.
 
11:53 AM IST

ఏపీలో 15 శాతం ఓటింగ్ నమోదు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 15 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెల్లడించారు. 

11:49 AM IST

ఈవీఎంలను బాగు చేశాం, నిర్భయంగా ఓటేయండి: ద్వివేది

సాంకేతిక కారణాలతో మొరాయించిన సుమారు 319 ఈవీఎంలను మరమ్మత్తు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెల్లడించారు. మరో 25 వరకు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
11:46 AM IST

ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీ కనకమేడల

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడటం వంటి అంశాలను తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చింది. ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్‌ను కలిశారు.
 
11:31 AM IST

ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

శ్రీకాకుళం: 10%
విజయనగరం: 4.8%
విశాఖపట్నం: 6%
తూర్పుగోదావరి: 12.36%
పశ్చిమగోదావరి: 8%
కృష్ణా: 3.96%
గుంటూరు: 7%
ప్రకాశం: 7.9%
నెల్లూరు: 7.83%
చిత్తూరు: 10.33%
కడప: 7.68%
కర్నూలు: 18.1%
అనంతపురం: 10.62%

11:16 AM IST

ఈవీఎంలు అన్ని పనిచేస్తున్నాయి.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: ఈసీ

రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పలు చోట్ల తలెత్తిన లోపాలను సరిదిద్దామని వెల్లడించింది. 
 
11:00 AM IST

ఎవరికీ వేసినా బీజేపీకే ఓటు..బెజవాడలో గందరగోళం

విజయవాడ జమ్మిసెంటర్ వద్ద పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఎవరికి ఓటు వేసినా... అది బీజేపీకే పడుతుండటంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
10:58 AM IST

అనంతపురం జిల్లాలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి

అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జంగంపల్లి గ్రామలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరగడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
 
10:55 AM IST

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు గృహ నిర్బంధం

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, లక్కిరెడ్డిపల్లెలో ఆయనను గృహ నిర్బంధం చేశారు.

10:51 AM IST

రాప్తాడులో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సనపలోని ఓ పోలింగ్ కేంద్రంలో పరిటాల అనుచరులు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సిద్ధరాంపురంలో వైసీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. 

10:48 AM IST

విజయనగరంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

విజయనగరం జిల్లా సదానందపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించే విషయంలో వివాదం తలెత్తడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 
    
10:45 AM IST

నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మల్యేపై వైసీపీ దాడి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడిపై వైసీపీ నేతలు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి హల్‌చల్ చేశారు. 

10:42 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ

సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిందూపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ నెంబర్ 42లో ఆయన భార్య వసుంధరతో  కలిసి ఓటు వేశారు.

10:38 AM IST

రాళ్ల దాడి: మంత్రి అఖిలప్రియ భర్త, చెల్లి గాయాలు

ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్, ఆమె సోదరి మోనికకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
    
10:34 AM IST

ఓటరుపై చేయిసుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని

కృష్ణాజిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఓటరుపై చేయి చేసుకున్నారు. డబ్బుల విషయంలో కార్యకర్తలు, ఓటర్ల మధ్య వివాదం చెలరేగడంతో అక్కడే ఉన్న నాని ఓటరుపై చేయి చేసుకున్నారు. 

10:29 AM IST

విజయవాడలో పోలింగ్ కేంద్రానికి తాళం

ఈవీఎంలు మొరాయించడంతో క్యూలైన్లలో వేచివున్న ఓటర్లు అసహనానికి గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనకు దిగిన ఓటర్లు... ఈసీ తీరుపై భగ్గుమంటున్నారు. క్యూలైన్లో నిలబడలేక విజయవాడ మొగల్రాజపురం 4వ పోలింగ్ కేంద్రానికి జనం తాళం వేశారు. 

10:17 AM IST

బద్వేల్‌లో రిగ్గింగ్‌కు దిగిన వైఎస్సార్‌సీపీ

కడప జిల్లా బద్వేల్‌లో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. కాశీనాయన మండలం గొంటువారిపల్లె 97వ బూత్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న వైసీపీ నేతలు తలుపులు మూసేసి, ఓటర్లను వెనక్కి పంపినట్లుగా తెలుస్తోంది. 

10:14 AM IST

ద్వివేదికి సీఎం లేఖ: రీపోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 372 ఈవీఎంలు పనిచేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఏపీ సీఈవో ద్వివేదికి లేఖ రాశారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయకపోవడంతో మూడు గంటలు వృథా అయ్యిందన్నారు.  

ఈవీఎంలు పనిచేయని చోట చంద్రబాబు రీపోలింగ్‌కు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఓటర్లు  ఆందోళనలో ఉన్నారని టీడీపీకి ఓటేస్తుంటే.. వైసీపీకి వెళ్తుందని ఫిర్యాదులొచ్చినట్లు తెలిపారు. 
    
10:09 AM IST

ఓటు వేసిన పవన్ కల్యాణ్

జనేసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమటలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంతకల్‌ జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. అయితే వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

10:08 AM IST

టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, జమ్మలమడుగులో ఉద్రిక్తత

కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొన్నతోట పోలింగ్ కేంద్రం టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 

9:56 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ షర్మిల

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి, వైఎస్ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు. పులివెందులలోని 134వ పోలింగ్ కేంద్రంలో ఆమె భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి ఓటు వేశారు. 

9:53 AM IST

మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ధర్నా

ఎన్నికల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. 
 
9:50 AM IST

సర్వేపల్లి స్వతంత్ర అభ్యర్థిపై వైసీపీ కార్యకర్తల దాడి

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి విజయరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. 

9:44 AM IST

ఏపీ వ్యాప్తంగా 372 ఈవీఎంల మొరాయింపు: ద్వివేది

రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారణాలతో మొరాయించినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఓటర్లు సిబ్బందితో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
9:41 AM IST

ఈవీఎంలు మొరాయింపు: చంద్రబాబు అసహనం

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి  వ్యక్తం చేశారు. ఈవీఎంల దుర్వినియోగంపై తాను ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. 

9:19 AM IST

టీడీపీ అభ్యర్థిపై వైసీపీ కార్యకర్తల దాడి, నరసరావుపేటలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

9:10 AM IST

వైసీపీ నేతపై ఎమ్మెల్యే దాడి, ఏలూరులో ఉద్రిక్తత

ఎన్నికల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నగరంలోని రాంనగర్ 9వ రోడ్డులోని  పోలింగ్ బూత్‌లో వైసీపీ కన్వీనర్ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో రాజును ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

8:53 AM IST

గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా అరెస్ట్

అనంతపురం జిల్లా గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన ఆయన ఈవీఎంను నేలకేసి కొట్టారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

8:48 AM IST

హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఓటు గల్లంతు

అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఓటు గల్లంతయ్యింది. 

8:35 AM IST

ఓటు వేసిన వైఎస్ విజయమ్మ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

8:33 AM IST

ఓటు వేసిన విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని

విజయవాడ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని నేని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుణదల సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.

8:24 AM IST

పనిచేయని ఈవీఎంలు, ఆందోళనకు దిగిన ఓటర్లు

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు అక్కడికి చేరుకున్నారు.

అయితే ఈవీఎలు పనిచేయకపోవడంతో పోలింగ్ బూత్‌ల నుంచి వారు వెనుదిరుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని 153 నెంబర్ బూత్‌లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. 

8:14 AM IST

ఓటు వేసిన నారా లోకేశ్, బ్రాహ్మణి

మంత్రి నారాలోకేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం  ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన భార్య బ్రాహ్మణితో  కలిసి ఓటు వేశారు. 

8:12 AM IST

ఓటు వేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన  ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

8:07 AM IST

50 ఈవీఎంలు మొరాయించాయి, రిపేర్ చేస్తున్నాం: ద్వివేది

రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని మున్సిపల్ హైస్కూల్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈవీఎంలను రిపేర్ చేసేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న అందరికీ ఓటు హక్కును కల్పిస్తామని ద్వివేది పేర్కొన్నారు. 
 
8:03 AM IST

ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ జగన్

వైసీపీ చీఫ్ వైస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని పోలింగ్ బూత్‌లో భార్య భారతితో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తనపై దేవుడి ఆశీస్సులు ఉంటాయని, జనం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నట్లు తెలిపారు.

7:59 AM IST

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ను అడ్డుకున్న వైసీపీ ఏజెంట్, ఉద్రిక్తత

ఎన్నికల వేళ కడప జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్తుండగా వైసీపీ ఏజెంట్ ఒకరు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
7:57 AM IST

గుత్తిలో ఉద్రిక్తత: ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్ధి

గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్ చల్ చేశారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన ఆయన ఈవీఎంను నేలకేసి కొట్టారు. 
 
7:39 AM IST

నిలిచిన మాక్ పోలింగ్

రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని సింధువాడ పంచాయతీ 181 పోలింగ్ కేంద్రంలో ఎంపీ బ్యాలెట్ యూనిట్‌కు బ్యాటరీ ఇవ్వకుండా అధికారులు ఈవీఎంను పంపారు. దీంతో మాక్ పోలింగ్ నిలిచిపోయింది.

మరోవైపు విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఉదయం 5.30 గంటలకు జరగాల్సిన మాక్ పోలింగ్ 35 కేంద్రాల్లో ఇంకా ప్రారంభం కాలేదు.
 
7:35 AM IST

మంగళగిరిలో మొరాయించిన ఈవీఎంలు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించాయి. తాడేపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయడం  లేదు. పోలింగ్ బూత్ నంబర్లు 20,24,26,39,27, 51,54,69లలో ఈవీఎంలు మొరాయించాయి. 

7:31 AM IST

ఓటు వేసేందుకు వచ్చిన సీఈవో ద్వివేది.. పని చేయని ఈవీఎంలు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా, ఆ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. 

7:28 AM IST

నరసరావుపేటలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యలమందలోని పోలింగ్ బూత్‌లో వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తమ ఏజెంట్లను నిర్బంధించారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. 
 
7:20 AM IST

రెండు చోట్ల మూడు ఈవీఎంలు

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు నియోజవర్గాల్లో ఎన్నికల సంఘం మూడు ఈవీఎంలు ఏర్పాటు చేసింది. అత్యధికంగా గుంటూరు పశ్చిమ నుంచి 34 మంది, మంగళగిరి నుంచి 32 మంది బరిలో ఉండటంతో ఇక్కడ మూడు ఈవీఎంలను వినియోగించాల్సి వస్తోంది. 
 
7:03 AM IST

ప్రారంభమైన పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రారంభానికి ముందు అధికారులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం అధికారులు ఓటింగ్‌కు అనుమతించారు. 
 
12:00 AM IST

విశాఖ ఏజెన్సీలో ముగిసిన పోలింగ్

విశాఖ ఏజెన్సీలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడ పోలింగ్‌ను సాయంత్రం 4 గంటల వరకే నిర్వహించారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 

6:01 PM IST:

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు, ఘర్షణలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ఎండ వేడిమి తగ్గడంతో పాటు ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో 6 గంటలకు కూడా బూత్‌లు కిక్కిరిసిపోయాయి.

ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైంది.

5:56 PM IST:

సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

5:51 PM IST:

తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. వేలుకు మార్క్ వేసే సిరా అయిపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. అప్పటికే భారీగా ఓటర్లు బారులు తీరడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. 

5:47 PM IST:

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ స్వగ్రామంలో వైసీపీ కార్యకర్త టీ. సాదమ్‌ను టీడీపీ నేతలు హత్య చేశారు. 

5:29 PM IST:

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఉద్రిక్త వాతవరణం చోటు చేసుకుంది. జనుపల్లిలో జనసేన కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. 
 
5:24 PM IST:

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరంగం సృష్టించారు. తన అనుచరులను అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ లోపల బైఠాయించి జేసీ ఆందోళన నిర్వహించారు.  

5:09 PM IST:

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ కథనాలు వెలువడుతుండటంతో కలకలం రేగింది. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి పోలింగ్ బూత్ వద్ద వీడియో దృశ్యాలను ఆ పార్టీ బయటపట్టింది. 
 
5:00 PM IST:

కర్నూలు జిల్లా బనగానపల్లె సంజామల ఏపీవో కళావతిని అధికారులు ఎన్నికల విధుల నుంచి తప్పించారు. బూత్ నెంబర్ 232లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ ఆమెపై ఫిర్యాదు రావటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. 

4:57 PM IST:

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది. 

4:53 PM IST:

ఎండలు వేడిమి తగ్గడంతో పాటు వాతావరణం చల్లబడటంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెరుగుతున్నారు. ఉదయం ఈవీఎంలు పనిచేయకపోవడంతో విసిగిపోయి ఇళ్లకు వెళ్లినవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తిరిగి పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. 
 
4:50 PM IST:

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం మండలం సవిరవిల్లిలోని పోలింగ్ బూత్‌లోని క్యూలో సుమారు 700 మంది ఓటర్లు బారులు తీరి ఉన్నారు. 

4:44 PM IST:

కడప జిల్లా పాములపాడు మండలం ఎర్రగడూరులో భారీ వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్తుగా విద్యుత్ శాఖ కరెంట్ సరఫరా నిలిపివేసింది. దీంతో అధికారులు సెల్‌ఫోన్ వెలుతురులో ఓటింగ్‌ను కొనసాగిస్తున్నారు. 
 
4:40 PM IST:

చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు కడప జిల్లా ఎస్పీ అవినాష్ మహంతి. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగలేదన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
 
4:37 PM IST:

తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫైరయ్యారు. తన పేరుతో ఓ నకిలీ ట్వీట్‌ను టీడీపీ ప్రచారం చేస్తోందని...ఓటమి కళ్ల ముందున్నప్పుడే ఇలాంటి దిగజారిన చర్యలకు పాల్పడతారని ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు. నకిలీ వార్తలను టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 

4:31 PM IST:

ఉదయం ఈవీఎంలు పనిచేయక ఓటు వేయని వారు తిరిగి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌ను చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ప్రజలంతా స్వేచ్ఛంగా, నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాలని కోరారు. ఓటింగ్‌ను అడ్డుకోవాలని వైసీపీ చేస్తున్న కుట్రలను విఫలం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 
 
4:26 PM IST:

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఓడిపోతామనే భయంతోనే భూమా కుటుంబం తమపై ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేసింది.

తాము కిడ్నాప్ చేసినట్లు ఆధారాలుంటే చూపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కిడ్నాప్ జరిగితే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. అహోబిలంలో మాపై దాడి చేసింది భూమా అనుచరులేనని వైసీపీ స్పష్టం చేసింది. 
 
4:17 PM IST:

ఇనిమిట్ల ఘటన స్పీకర్ కోడెల డ్రామా అన్నారు సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు. ఓటమి భయంతో టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని, కోడెల పోలింగ్ బూత్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నారని రాంబాబు ఆరోపించారు.

రెండు గంటల పాటు బూత్‌లో తలుపులేసి కూర్చోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారని అంబటి మండిపడ్డారు. పోలింగ్ నిలిచిపోవడానికి కోడెలే కారణమని, ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని రాంబాబు స్పష్టం చేశారు. 

4:09 PM IST:

కడప జిల్లా బద్వేల్‌లో టీడీపీ నేత ఒకరు హల్ చల్ చేశారు. పట్టణంలోని చెన్నంపల్లెలోని పోలింగ్ బూత్ నెం 176లోకి ప్రవేశించిన అతను ఈవీఎం సామాగ్రిని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. 

4:03 PM IST:

మధ్యాహ్నం 3.30 గంటల వరకు నమోదైన పోలింగ్ ఈ విధంగా ఉంది.

శ్రీకాకుళం 54%
విజయనగరం 63%
విశాఖపట్నం 51%
తూర్పుగోదావరి 52%
పశ్చిమగోదావరి 50 %
కృష్ణా 51 %,
గుంటూరు  50 %
ప్రకాశం   58 %
నెల్లూరు  53 %
చిత్తూరు  57 %
కర్నూలు 40 %
కడప   63  %
అనంతపురం 53%,

4:02 PM IST:

విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఓటర్లు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. 

4:00 PM IST:

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో కట్టకిందపల్లెలో వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో బాబుతో పాటు అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాబు కారు ధ్వంసమైంది. 

3:55 PM IST:

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల మధ్య వివాదం తలెత్తడంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

3:46 PM IST:

గుంటూరు జిల్లా గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై దాడి చేయడంతో పట్టణంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మాచవరం మండలం కొత్తగణేషునిపాలెంలో దళితులను ఓటింగ్ వెళ్లనీయడం లేదంటూ సమాచారం అందడంతో మహేశ్ అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

3:38 PM IST:

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెల్లడించారు. పోలింగ్ సరళి ఇలాగే ఉంటే సాయంత్రానికి 80 శాతం దాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పోలింగ్ గడువును పెంచాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ద్వివేది తెలిపారు. 
 
3:12 PM IST:

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఓ రెస్టారెంట్‌పై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో రెస్టారెంట్ అద్దాలు, ఫర్నిచర్, పలుకార్లు ధ్వంసమయ్యాయి. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా ఆందోళనకారులు దాడికి యత్నించారు. 

2:55 PM IST:

రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందున్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలు జరిగాయని దానితో పాటు మరో 20 చోట్ల ఘర్షణలు జరిగాయని వివరించారు.

ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ఘర్షణలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు. 381 ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని.. వాటిని మరమ్మత్తు చేయించామని వెల్లడించారు. 

2:48 PM IST:

కడప జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఖాజీపేట మండలం మిడ్తూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ సుబ్బారెడ్డి కారుపై వారు రాళ్లు విసిరారు. 

2:43 PM IST:

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు వేట కోడవళ్లతో దాడులు చేసుకోవడంతో టీడీపీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి చనిపోయారు.

విషయం తెలుసుకున్న టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరాపురం గ్రామానికి చేరుకున్నారు. మరోవైపు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. 
 
2:40 PM IST:

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనమెట్లలో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారంతోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు.

పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే తనపై వైసీపీ నేతలు దాడి చేశారని.. పోలింగ్ అధికారులు తలుపులు వేస్తే వాటిని పగులగొట్టారన్నారు. వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తారని ముందే ఊహించామని చెప్పారు. మూడున్నర దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఈ విధంగా దాడులు చేయడం మొదటిసారిగా చూస్తున్నానని స్పీకర్ వ్యాఖ్యానించారు. 

2:25 PM IST:

ఈవీఎంలను ఎన్నికల సంఘం మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఊపందుకుంది. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. 
 
2:20 PM IST:

ఈవీఎంలు మొరాయించడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఎన్నికల కమిషన్‌పై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ మొగల్రాజపురం జమ్మి చెట్టు వద్ద మహిళలు ఆందోళన చేశారు. ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

2:18 PM IST:

విజయవాడ మొగల్రాజపురంలోని శ్రామిక విద్యాపీఠం 4వ బూత్‌లో ఉదయం నుంచి ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో మధ్యాహ్నం 1.45 గంటలకు అధికారులు పోలింగ్‌ను ప్రారంభించారు. అయితే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. 
 
1:24 PM IST:

ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చీరాల మండలం పిట్టువారిపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చేసుకుంది. ఈ ఘటనలో ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకరాయితో దాడి చేశారు. 
 
1:19 PM IST:

బీజేపీ, టీఆర్ఎస్ మద్ధతుతో వైఎస్సార్ కాంగ్రెస్ రెచ్చిపోతోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఓటమి భయంతోనే వైసీపీ హత్యలు, హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. 

1:13 PM IST:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

శ్రీకాకుళం  : 30 శాతం

విజయనగరం  :  35 శాతం

విశాఖ  :   33 శాతం

పశ్చిమగోదావరి ; 32 శాతం

తూర్పు గోదావరి : 32 శాతం

విజయవాడ : 33 శాతం

గుంటూరు  : 32 శాతం

ప్రకాశం : 33 శాతం

నెల్లూరు : 32 శాతం

కర్నూలు : 32 శాతం

చిత్తూరు :  31 శాతం

కడప :  30 శాతం

అనంతపురం : 30 శాతం

1:00 PM IST:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యాహ్నం 11 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. 

శ్రీకాకుళం: 19.78%
విజయనగరం: 31.57%
విశాఖపట్నం: 21.64%
తూర్పుగోదావరి: 27.50%
పశ్చిమగోదావరి: 20.41%
కృష్ణా: 24.10%
గుంటూరు: 24%
ప్రకాశం: 22%
నెల్లూరు: 23.32%
చిత్తూరు: 25.18%
కడప: 17.84%
కర్నూలు: 23%
అనంతపురం: 21.47%

12:56 PM IST:

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ  ద్వివేదిని వైసీపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో పోలింగ్ సరళి, ఈవీఎంల పనితీరుపై టీడీపీ అనుకూల మీడియాలో దుష్ప్రాచారాన్ని వారు సీఈవో దృష్టికి తీసుకొచ్చారు.

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలకే రీ పోలింగ్ అంటున్నారని వారు విమర్శించారు. ద్వివేదిని కలిసిన వారిలో వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి ఉన్నారు.

12:53 PM IST:

కడప జిల్లా రాయచోటిలో ఇప్పటికీ ఈవీఎంలు గాడిన పడలేదు. నియోజకవర్గంలోని 45వ పోలింగ్ స్టేషన్‌లో పార్లమెంట్‌‌కు సంబంధించిన ఈవీఎం ఇప్పటి వరకు పనిచేయలేదు. ఇప్పటికీ రెండు సార్లు ఈవీఎంలను మార్చినప్పటికీ అదే పరిస్ధితి కొనసాగుతోంది.

12:37 PM IST:

ఎన్నికల సంఘం పనితీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయిందని పవన్ మండిపడ్డారు. ఈసీ కట్టుదిట్టంగా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేనాని ఆరోపించారు.

12:35 PM IST:

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటు చేసుకుంది. వీరాపురంలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు వేట కొడవళ్లలో పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కరరెడ్డి మరణించగా, వైసీపీకి చెందిన పుల్లారెడ్డి అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, భారీగా మోహరించారు.

12:14 PM IST:

పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని 15వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి వచ్చిన బండారు ముసలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

12:42 PM IST:

రాజుపాలెంట మండలం ఇనిమెట్లలో స్పీకర్ కోడెల శివప్రసాద్ హల్‌చల్ చేశారు. ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి కోడెల తలుపులు వేశారు. 20 నిముషాల పాటు ఆయన చొక్కా విప్పి పోలింగ్ బూత్‌లోనే బైఠాయించారు.

దీంతో పోలీసులు కోడెలను బలవంతంగా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో స్పీకర్ సొమ్మసిల్లి పడిపోయారు. 

11:58 AM IST:

కడప జిల్లా గుండాలపల్లెలో మధ్యాహ్నం 12 గంటలు కావొస్తున్నా ఇప్పటికీ పోలింగ్ ప్రారంభం కాలేదు. వీవీ ప్యాట్ మొరాయించడంతో అధికారులు పోలింగ్‌ను ప్రారంభించలేదు.

11:55 AM IST:

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈవీఎంల పనితీరు గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు పడి.... ఎంపీ అభ్యర్థికి ఓట్లు పడకపోవడాన్ని ప్రజలు అధికారుల దృష్టికి  తీసుకొచ్చారు.
 
11:53 AM IST:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 15 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెల్లడించారు. 

11:50 AM IST:

సాంకేతిక కారణాలతో మొరాయించిన సుమారు 319 ఈవీఎంలను మరమ్మత్తు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెల్లడించారు. మరో 25 వరకు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
11:46 AM IST:

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడటం వంటి అంశాలను తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చింది. ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్‌ను కలిశారు.
 
11:32 AM IST:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

శ్రీకాకుళం: 10%
విజయనగరం: 4.8%
విశాఖపట్నం: 6%
తూర్పుగోదావరి: 12.36%
పశ్చిమగోదావరి: 8%
కృష్ణా: 3.96%
గుంటూరు: 7%
ప్రకాశం: 7.9%
నెల్లూరు: 7.83%
చిత్తూరు: 10.33%
కడప: 7.68%
కర్నూలు: 18.1%
అనంతపురం: 10.62%

11:16 AM IST:

రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పలు చోట్ల తలెత్తిన లోపాలను సరిదిద్దామని వెల్లడించింది. 
 
11:00 AM IST:

విజయవాడ జమ్మిసెంటర్ వద్ద పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఎవరికి ఓటు వేసినా... అది బీజేపీకే పడుతుండటంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
10:58 AM IST:

అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జంగంపల్లి గ్రామలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరగడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
 
10:55 AM IST:

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, లక్కిరెడ్డిపల్లెలో ఆయనను గృహ నిర్బంధం చేశారు.

10:51 AM IST:

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సనపలోని ఓ పోలింగ్ కేంద్రంలో పరిటాల అనుచరులు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సిద్ధరాంపురంలో వైసీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. 

10:48 AM IST:

విజయనగరం జిల్లా సదానందపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించే విషయంలో వివాదం తలెత్తడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 
    
10:45 AM IST:

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడిపై వైసీపీ నేతలు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి హల్‌చల్ చేశారు. 

10:42 AM IST:

సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిందూపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ నెంబర్ 42లో ఆయన భార్య వసుంధరతో  కలిసి ఓటు వేశారు.

10:38 AM IST:

ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్, ఆమె సోదరి మోనికకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
    
10:34 AM IST:

కృష్ణాజిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఓటరుపై చేయి చేసుకున్నారు. డబ్బుల విషయంలో కార్యకర్తలు, ఓటర్ల మధ్య వివాదం చెలరేగడంతో అక్కడే ఉన్న నాని ఓటరుపై చేయి చేసుకున్నారు. 

10:29 AM IST:

ఈవీఎంలు మొరాయించడంతో క్యూలైన్లలో వేచివున్న ఓటర్లు అసహనానికి గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనకు దిగిన ఓటర్లు... ఈసీ తీరుపై భగ్గుమంటున్నారు. క్యూలైన్లో నిలబడలేక విజయవాడ మొగల్రాజపురం 4వ పోలింగ్ కేంద్రానికి జనం తాళం వేశారు. 

10:17 AM IST:

కడప జిల్లా బద్వేల్‌లో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. కాశీనాయన మండలం గొంటువారిపల్లె 97వ బూత్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న వైసీపీ నేతలు తలుపులు మూసేసి, ఓటర్లను వెనక్కి పంపినట్లుగా తెలుస్తోంది. 

10:14 AM IST:

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 372 ఈవీఎంలు పనిచేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఏపీ సీఈవో ద్వివేదికి లేఖ రాశారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయకపోవడంతో మూడు గంటలు వృథా అయ్యిందన్నారు.  

ఈవీఎంలు పనిచేయని చోట చంద్రబాబు రీపోలింగ్‌కు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఓటర్లు  ఆందోళనలో ఉన్నారని టీడీపీకి ఓటేస్తుంటే.. వైసీపీకి వెళ్తుందని ఫిర్యాదులొచ్చినట్లు తెలిపారు. 
    
11:10 AM IST:

జనేసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమటలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంతకల్‌ జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. అయితే వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

10:08 AM IST:

కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొన్నతోట పోలింగ్ కేంద్రం టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 

9:56 AM IST:

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి, వైఎస్ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు. పులివెందులలోని 134వ పోలింగ్ కేంద్రంలో ఆమె భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి ఓటు వేశారు. 

9:53 AM IST:

ఎన్నికల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. 
 
9:51 AM IST:

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి విజయరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. 

9:44 AM IST:

రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారణాలతో మొరాయించినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఓటర్లు సిబ్బందితో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
9:44 AM IST:

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి  వ్యక్తం చేశారు. ఈవీఎంల దుర్వినియోగంపై తాను ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. 

9:19 AM IST:

గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

9:10 AM IST:

ఎన్నికల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నగరంలోని రాంనగర్ 9వ రోడ్డులోని  పోలింగ్ బూత్‌లో వైసీపీ కన్వీనర్ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో రాజును ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

8:53 AM IST:

అనంతపురం జిల్లా గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన ఆయన ఈవీఎంను నేలకేసి కొట్టారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

8:48 AM IST:

అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఓటు గల్లంతయ్యింది. 

8:45 AM IST:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

8:33 AM IST:

విజయవాడ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని నేని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుణదల సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.

8:24 AM IST:

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు అక్కడికి చేరుకున్నారు.

అయితే ఈవీఎలు పనిచేయకపోవడంతో పోలింగ్ బూత్‌ల నుంచి వారు వెనుదిరుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని 153 నెంబర్ బూత్‌లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. 

8:14 AM IST:

మంత్రి నారాలోకేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం  ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన భార్య బ్రాహ్మణితో  కలిసి ఓటు వేశారు. 

8:28 AM IST:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన  ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

8:08 AM IST:

రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని మున్సిపల్ హైస్కూల్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈవీఎంలను రిపేర్ చేసేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న అందరికీ ఓటు హక్కును కల్పిస్తామని ద్వివేది పేర్కొన్నారు. 
 
8:41 AM IST:

వైసీపీ చీఫ్ వైస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని పోలింగ్ బూత్‌లో భార్య భారతితో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తనపై దేవుడి ఆశీస్సులు ఉంటాయని, జనం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నట్లు తెలిపారు.

8:00 AM IST:

ఎన్నికల వేళ కడప జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్తుండగా వైసీపీ ఏజెంట్ ఒకరు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
7:57 AM IST:

గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్ చల్ చేశారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన ఆయన ఈవీఎంను నేలకేసి కొట్టారు. 
 
7:40 AM IST:

రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని సింధువాడ పంచాయతీ 181 పోలింగ్ కేంద్రంలో ఎంపీ బ్యాలెట్ యూనిట్‌కు బ్యాటరీ ఇవ్వకుండా అధికారులు ఈవీఎంను పంపారు. దీంతో మాక్ పోలింగ్ నిలిచిపోయింది.

మరోవైపు విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఉదయం 5.30 గంటలకు జరగాల్సిన మాక్ పోలింగ్ 35 కేంద్రాల్లో ఇంకా ప్రారంభం కాలేదు.
 
7:35 AM IST:

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించాయి. తాడేపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయడం  లేదు. పోలింగ్ బూత్ నంబర్లు 20,24,26,39,27, 51,54,69లలో ఈవీఎంలు మొరాయించాయి. 

7:32 AM IST:

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా, ఆ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. 

7:28 AM IST:

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యలమందలోని పోలింగ్ బూత్‌లో వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తమ ఏజెంట్లను నిర్బంధించారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. 
 
7:21 AM IST:

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు నియోజవర్గాల్లో ఎన్నికల సంఘం మూడు ఈవీఎంలు ఏర్పాటు చేసింది. అత్యధికంగా గుంటూరు పశ్చిమ నుంచి 34 మంది, మంగళగిరి నుంచి 32 మంది బరిలో ఉండటంతో ఇక్కడ మూడు ఈవీఎంలను వినియోగించాల్సి వస్తోంది. 
 
7:03 AM IST:

ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రారంభానికి ముందు అధికారులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం అధికారులు ఓటింగ్‌కు అనుమతించారు. 
 
4:20 PM IST: