వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పుంగనూరు నుంచే ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఇప్పటికీ అభ్యర్థితత్వం ఖరారైన నేపథ్యంలో ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు.

అయితే ప్రతీసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేముందు ఆయనకు ఒక సెంటమెంట్ ఉంది. పెద్దిరెడ్డి ఏ ఎన్నికల్లో బరిలో నిలిచినా నియోజకవర్గానికి రాశిదిక్కులో ఉన్న హనుమంతరాయదిన్నె నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టడం ఆయనకు ఆనవాయితీగా వస్తోంది.

ఆదివారం ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో సోమవారం వైసీపీ ముఖ్యనేతలు, అభిమానులతో కలిసి వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీని బలపరచాలని కోరాల్సిందిగా పార్టీ శ్రేణులకు, నేతలకు సూచించారు.