ఎస్పీవై రెడ్డి పేరు తెలియనివారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఆయన. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి, ఫలితాలు వెలువడిన మరుక్షణం తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారు. అనారోగ్యం కారణంగా ఆయనను పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. 

అయితే, స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేయడానికి సిద్ధపడినట్లు తెలుసుకున్న జనసేన నాయకులు ఆయనకు గాలం వేశారు. వెంటనే ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆలింగనం చేసుకుని జనసేన పార్టీలో చేరిపోయారు. జనసేన అభ్యర్థిగా నంద్యాల లోకసభ సీటుకు పోటీ చేయనున్నారు.