కమెడియన్ అలీ విచిత్రంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. విచిత్రమే మరి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన ఆప్త మిత్రుడు. జగన్ తోనూ పవన్ కల్యాణ్ తోనూ చివరకు చంద్రబాబుతోనూ భేటీలు జరిపి చివరకు వైసిపి గూటికి చేరుకున్నారు స్నేహం వేరు, రాజకీయాలు వేరని జనసేనలో చేరకపోవడంపై అలీ వ్యాఖ్యానించారు. టీడీపిలో భవిష్యత్తు భరోసా కనిపించలేదని అన్నారు తాను భవిష్యత్తుకు భరోసా కల్పిస్తానని చంద్రబాబు ఆదివారం రాత్రి అన్న మాటలను ఆయన ఇలా తిప్పికొట్టారన్నమాట.