వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి మంత్రి ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కడప జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జిల్లా ప్రజలు లబ్ది పొందుతున్నారన్నారు. ఫ్యాక్షన్ లేని ఫ్యాషన్ జిల్లాగా కడపను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కడప ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. రౌడీయిజంతో జగన్ చెలరేగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ కి మరోసారి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.