విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ . పవన్ కళ్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని వెహికల్ మార్చ్ అంటూ విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వంపైనా, వైసీపీ నేతలపైనా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లాంగ్ మార్చ్‌లో పవన్ కనీసం 2 కిలో మీటర్లు కూడా నడవలేకపోయిన పవన్ కళ్యాణ్ మా నాయకులను విమర్శిస్తారా అంటూ విమర్శించారు. 

శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా నేతలను పక్కన పెట్టుకుని పవన్ మాట్లాడాటం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియాకు, డ్రగ్‌ మాఫియాకు బ్రాండ్‌ అంబాసిడర్లయిన అచ్చెన్నాయుడిని, అయ్యన్నపాత్రుడిని పక్కన పెట్టుకుని వేదికపై నీతులు వల్లిస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకున్నారని విమర్శించారు. 

ఇసుక సమస్యను పరిష్కరించడం కోసం వైసీపీకి గడువు ఇవ్వడానికి పవన్ ఎవరని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీతో పవన్ లాలూచీ పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు అమర్ నాథ్ రెడ్డి. 
ఎన్నడూ లేనివిధంగా భవన నిర్మాణ కార్మికులపై టీడీపీతో కలిసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  కపటప్రేమ చూపిస్తూ లాంగ్‌మార్చ్‌ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

రాష్ట్రంలో కొంతమేర ఇసుక కొరత ఉందన్నది వాస్తవమేనని అది కూడా ప్రకృతి వైపరీత్యం కారణంగా అని చెప్పుకొచ్చారు. విశాఖలో ఏ నది ఉందని పవన్‌ కళ్యాణ్‌ లాంగ్‌మార్చ్‌కి పిలుపునిచ్చారని ప్రశ్నించారు. 

ప్రభుత్వానికి 15 రోజలు గడువిస్తున్నారంటే ఇసుక లభ్యతపై పవన్‌కు అవగాహనే లేదని అర్థమవుతోందని తెలిపారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఎందుకు ప్రశ్నించలేదో పవన్ కళ్యాణ్ చెప్పాలని నిలదీశారు అమర్ నాథ్.  

ఈ వార్తలు కూడా చదవండి

హద్దు మీరితే తాట తీస్తా.. కన్నబాబు, విజయసాయిలకు పవన్ వార్నింగ్

5 నెలల్లో రాష్ట్రం అధోగతిపాలు.. మన ఇసుక హైదరాబాద్‌కి వెళ్తొంది: అచ్చెన్నాయుడు