బొబ్బలెక్కిన పాదాలు: పలకరింపులో నొప్పి తెలియదన్న జగన్

YS Jagan faces trouble with injuries
Highlights

ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదాలు బొబ్బలెక్కాయి.

హైదరాబాద్: ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదాలు బొబ్బలెక్కాయి. కాళ్లు బొబ్బలతో చీము కారే దశలో ఉన్నాయి.  ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం బయటపడింది. 

ఆ విషయాన్ని జాతీయ దినపత్రిక ప్రతినిధి .. ఎంతో ఇన్ఫెక్షన్ కి గురయినా కానీ ఇంత నొప్పితో ఎలా నడుస్తున్నారని  అడిగాడు. దాంతో జగన్ చిరునవ్వు నవ్వుతూ ... కాళ్ళకు రోజు ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంటుందని, ఎంత నొప్పి ఉన్నా పాదయాత్రలో  ప్రజలు ఎదురొచ్చి  పలకరించగానే ఆ నొప్పి మటుమాయం అవుతుందనని చెప్పారు. 

తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తుందని జగన్ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ స్పష్టం చేశారు. జనసేనతో కానీ, బీజేపీతో కానీ వైఎస్సార్సీపీ పొత్తు ఉండదనే విషయాన్ని ఆ విధంగా స్పష్టం చేశారు. . 

పవన్ కల్యాణ్ మీకే మద్దతు పలకనున్నారని మీ పార్టీ ఎంపీ ఒకరు ప్రకటించారు కదా అని ప్రస్తావించగా అలాంటి ప్రతిపాదన ఏదీ తన వద్దకు రాలేదని అన్నారు. 

loader