విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ. 10 లక్షలు: బాధ్యులపై చర్యలకు జగన్ ఆదేశం
విజయవాడలో మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
విజయవాడ: Vijayawadaa లో మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంYS Jagan శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కోరారు. బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు.
బాధిత కుటుంబానికి అండగా నిలవాలన్నారు. ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించారు. వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్‌ఎంఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.
ఈ నెల 19వ తేదీన ఇంటి నుండి యువతి వెళ్లిపోయింది. అయితే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోనే యువతిపై ముగ్గురు Gang Rape కి పాల్పడ్డారు.ఈ విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆరోపణలు రావడంతో ఈ విషయమై విచారణ నిర్వహించి నున్న సీఐ, ఎస్ఐలను suspend చేశారు. మరో వైపు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. ఆసుపత్రిలో పాగింగ్ విధులను ఓ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ సంస్థ ద్వారా ఈ ముగ్గురు నియమించారు. ఈ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నారు. ఈ ముగ్గురిని కూడా విధుల నుండి తప్పించారు.